సమంత గురించి నాగ చైతన్య పాజిటివ్ కామెంట్స్..!
Naga Chaitanya Comments On Samantha. థాంక్యూ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న నాగ చైతన్య..
By Medi Samrat Published on 22 July 2022 4:04 PM ISTథాంక్యూ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న నాగ చైతన్య.. మరోసారి తన మాజీ భార్య సమంత గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తనకు సమంతతో బాగుంటుందని.. మా ఇద్దరి మధ్య సూపర్ హిట్ ప్రేమకథలు వచ్చాయని అన్నారు. ఎవరితో మీకు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరిందని అనుకుంటున్నారు అని యాంకర్ అడగ్గా.. నాగచైతన్య బదులిస్తూ.. "సాయి పల్లవితో లవ్ స్టోరీ సినిమా చేశాను. మా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంది. అలాగే సామ్, నేను కలిసి తెరపై కొన్ని అందమైన ప్రేమకథలను చేశాము. సమంతతో కూడా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది. ఈ ఇద్దరితో తెరపై కెమిస్ట్రీ బాగానే ఉంటుంది " అంటూ చెప్పుకొచ్చాడు. సామ్, నాగచైతన్య ఇద్దరి కాంబోలో ఏమాయ చేసావే.. మనం.. మజిలీ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.
కాఫీ విత్ కరణ్ షో లో సమంత మాత్రం ఎన్నో సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే..! కరణ్ జోహార్ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఉండగా.. ఆయన భర్త కాదు, మాజీ భర్త అని సమంత చెప్పింది. ప్రస్తుతం ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందని కరణ్ అడిగితే.. ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే, ఆ గదిలో కత్తులు వంటి వాటిని దాచేయాలని చెప్పింది. ఇద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధాలు లేవని తెలిపింది. భవిష్యత్తులో ఫ్రెండ్లీగా ఉండొచ్చేమో చెప్పలేమని వ్యాఖ్యానించింది. విడాకుల తర్వాత తాను 250 కోట్ల భరణం తీసుకున్నానని ప్రచారం చేశారని, అది నిజం కాదని స్పష్టం చేసింది. విడాకుల నుంచి బయటకు వచ్చేందుకు చాలానే కష్టపడ్డాను.. ఇప్పుడు బాగానే ఉంది. నేను గతంలో కంటే బలంగా ఉన్నానని సమంత చెప్పుకొచ్చింది.