మైత్రి మూవీ మేకర్స్ దూకుడు మాములుగా లేదుగా..!

Mythri Movie Makers. తెలుగులో గొప్ప నిర్మాణ సంస్థ మైత్రి వాళ్ల చూపు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్‌లో పాగా వేయాలని చూస్తున్నారు.

By Medi Samrat  Published on  11 Feb 2021 3:53 PM GMT
Mythri Movie Makers

తెలుగులో అనేక విజయాత్మక సినిమాలు నిర్మించి గొప్ప నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. ఇంకా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది.. మైత్రి మూవీ మేకర్స్‌ మంచి జోరు మీద ఉందని చాలా రోజుల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలతో సినిమా చేస్తూనే, ప్రామిసింగ్‌ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ ఉన్నారు. వాటిలో ఎక్కువ శాతం విజయాలే.

అయితే ఇప్పుడు మైత్రి వాళ్ల చూపు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్‌లో పాగా వేయాలని చూస్తున్నారు.ఇప్పటికే బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌కు అడ్వాన్స్‌ ఇచ్చారని వార్తలు వస్తుండగా… తమిళ పరిశ్రమలో ఎంట్రీకి విజయ్‌ను ఎంచుకున్నారని తెలుస్తోంది.

బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌ సినిమా వచ్చే ఏడాది మొదలవుతుందని తెలుస్తోంది. ఈలోగా తమిళంలో విజయ్‌తో ఓ సినిమా ఓకే అయ్యిందట. మైత్రీ మూవీ మేకర్స్‌కి. విజయ్‌తో భారీ సినిమా తీసేందుకు అడ్వాన్స్‌ కూడా ఇచ్చేశారట. విజయ్‌తో సినిమా అంటే వందల కోట్ల వ్యవహారం. ప్రస్తుతం విజయ్‌ తీసే సాధారణ సినిమా అయినా కోట్లు సంపాదిస్తోంది.

దీంతో మైత్రీ మూవీ మేకర్స్ కోలీవుడ్‌ ఎంట్రీకి విజయ్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం విజయ్‌కి ఇప్పటికే అడ్వాన్స్‌ ఇచ్చారని టాక్‌. అయితే దర్శకుడు ఎవరు, సినిమా ప్రారంభం ఎప్పుడు లాంటి ఆలోచనలేవీ లేవట. సరైన కథ, సమయం దొరికినప్పుడు మొదలుపెట్టేస్తారు. ఇదే మైత్రీ మూవీ మేకర్స్ స్ట్రాటజీ అండ్ స్టయిల్‌ కూడా. ఇటీవల మైత్రీ టీమ్‌ చిరంజీవి సినిమా ఓకే చేయించుకుంది. దీన్ని బట్టి చూస్తే మైత్రి హవా మాములుగా లేదని అర్ధమవుతుంది.
Next Story