మేం విడిపోతున్నాం.. 11 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు ప‌లికిన సంగీత ద‌ర్శ‌కుడు

సంగీత ద‌ర్శ‌కుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్, ఆయన భార్య, గాయని సైంధవి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

By Medi Samrat  Published on  14 May 2024 8:42 AM IST
మేం విడిపోతున్నాం.. 11 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు ప‌లికిన సంగీత ద‌ర్శ‌కుడు

సంగీత ద‌ర్శ‌కుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్, ఆయన భార్య, గాయని సైంధవి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన‌ ప్రకటనను ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఇరువురు పంచుకున్నారు. సుదీర్ఘ చ‌ర్చ‌ల అనంత‌రం నేను, సైంధవి ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మనశ్శాంతి, ఇద్ద‌రి జీవితాల మెరుగుద‌ల కోసం ఒక‌రికొక‌రం ప‌ర‌స్ప‌ర గౌర‌వంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. అంద‌రూ అర్ధం చేసుకుంటార‌ని.. మా ప్రైవ‌సీని గౌర‌విస్తార‌ని ఆశిస్తున్నామ‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

జీవీప్రకాష్-సైంధవి విడాకులు తీసుకోబోతున్నారనే వార్త అభిమానుల్లో తీవ్ర‌ అసంతృప్తిని కలిగించింది. వీరికి వివాహమై 11 ఏళ్లు అయింది. జీవీ ప్రకాష్ కుమార్ 2013లో గాయని సైంధవిని వివాహం చేసుకున్నారు. వీరికి అన్వీ అనే 4 ఏళ్ల కూతురు ఉంది.

జీవీ 2006లో విడుదలైన వీల్ అనే తమిళ చిత్రం ద్వారా సంగీత ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేసాడు. ప్ర‌స్తుతం అత‌డు తమిళ చిత్రసీమలో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రు. అలాగే మంచి మార్కెట్ ఉన్న‌ నటుడు. జీవీ హీరోగా పెన్సిల్, త్రిష ఇల్లానా నయనతార, ఎర్ర పసుపు పచ్చ వంటి సూపర్ హిట్స్ లో న‌టించాడు. అలాగే అత‌డు నటించిన‌ పామిలర్, జైల్, సెల్బీ, అదియే వంటి చిత్రాలకు జనంలో మిశ్రమ స్పందన లభించింది.

Next Story