ధోని వచ్చేశాడు.. తొలి సినిమా డీటైల్స్ ఇవిగో..!

MS Dhoni to make his first feature film in Tamil. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని

By Medi Samrat
Published on : 25 Oct 2022 6:16 PM IST

ధోని వచ్చేశాడు.. తొలి సినిమా డీటైల్స్ ఇవిగో..!

రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. తన జీవితంలో సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతున్నాడు. దీపావళి సందర్భంగా ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ అనే ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభించి ఎంఎస్ ధోని నిర్మాతగా మారారు. ధోని తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. తన మొదటి చిత్రాన్ని తీయనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న అతని భార్య సాక్షి సింగ్ ధోని కథని అందించగా.. ఈ చిత్రానికి రమేష్ తమిళమణి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ప్రధాన నటీనటులు, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. వాటిని అతి త్వరలో వెల్లడించనున్నారు.

ధోని తమిళనాడు ప్రజలతో అసాధారణమైన బంధాన్ని పంచుకున్నాడని.. తమిళంలో తన మొదటి చిత్రాన్ని నిర్మించడం ద్వారా ఈ బంధాన్ని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నాడు. తమిళంతోపాటు ప్రధాన భాషల్లో సైన్స్‌ ఫిక్షన్‌, కామెడీ డ్రామా, కామెడీ, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్లతోపాటు వివిధ జోనర్లలో కంటెంట్‌ ఉన్న సినిమాలు, ఇతర ప్రాజెక్ట్‌లు చేసేందుకు పలువురు డైరెక్టర్లు, స్క్రిప్ట్‌ రైటర్లతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు ధోనీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ తమ ప్రకటనలో తెలిపింది.


Next Story