తెలుగులో 'మనీ హెయిస్ట్' తీస్తే.. ప్రొఫెసర్‌గా అతడే..!

Money Heist Was Made In Telugu. కరోనా దెబ్బతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అది ఎంతలా అంటే..

By అంజి  Published on  14 Sept 2021 11:16 AM IST
తెలుగులో మనీ హెయిస్ట్ తీస్తే.. ప్రొఫెసర్‌గా అతడే..!

కరోనా దెబ్బతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అది ఎంతలా అంటే.. సినిమా థియేటర్‌లలో అభిమాన హీరో సినిమా రిలీజైన.. అది ఓటీటీలో వచ్చేంత వరకూ వేచి ఉండేలా. ఓటీటీలు వెబ్‌సిరీస్‌లు, సినిమాలతో వీక్షకులను కట్టిపడేస్తున్నాయి. కొత్త కొత్త వెబ్‌సిరీస్‌లతో వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'మనీ హెయిస్ట్' వెబ్‌ సిరీస్‌ వీక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. రాయల్ మింట్ ఆఫ్ స్పెయిన్, బ్యాంక్ ఆఫ్ స్పెయిన్‌ స్టోరీల ఆధారంగా రెండు భాగాలుగా ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. మొదటి భాగం సెప్టెంబర్‌ 3న విడుదలైంది. రెండో భాగం ఈ ఏడాది చివరలో విడుదల కానుంది. ఇలాంటి వెబ్‌సిరీస్‌లు హలీవుడ్‌ సినిమాలు చూసేవారికి ఎక్కువగా అర్థమవుతాయి.


అయితే.. కొందరికి తెలుగు తప్ప ఇంకో భాష సినిమాలు అర్థం కావు. అలాంటి వారి కోసమే ఈ వెబ్‌సిరీస్‌ను తెలుగులో డబ్‌ చేసి అందిస్తున్నారు. తాజాగా తెలుగులో విడుదలైన 'మనీ హెయిస్ట్' వీక్షకులకు బాగా అలరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెలుగులో తీస్తే.. అంటూ ఓ వీడియోను నెట్‌ఫ్లిక్స్‌ తన అభిమానులతో పంచుకుంది. ఈ సిరీస్‌లోని పాత్రలకు తగ్గట్టుగా తెలుగు సినిమాల్లోని వివిధ క్యారెక్టర్‌లను ఎంపిక చేశారు. ఫ్రొఫెసర్‌గా దర్శకుడు, యాక్టర్ తరుణ్ భాస్కర్ కనబడ్డారు. అలాగే మిగతా పాత్రల్లో చంద్రముఖి, రోబో, పశుపతి, బల్లాలదేవ, నీలాంబరి, మహాద్రష్ట పాత్రలను ఎంపిక చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెలుగు వీక్షకులకు నవ్వులు పంచుతోంది.


Next Story