ఫోటో షేర్ చేసిన‌ ఇలియానా.. పుట్ట‌బోయే బిడ్డ‌కు తండ్రి అంటూ..

Mom-To-Be Ileana D'Cruz's Note For Boyfriend. నటి ఇలియానా ప్ర‌స్తుతం గర్భవతి. అయితే ఇప్పటి వరకూ ఆమె తన బాయ్‌ఫ్రెండ్ లేదా భాగస్వామిని

By Medi Samrat  Published on  10 Jun 2023 1:30 PM IST
ఫోటో షేర్ చేసిన‌ ఇలియానా.. పుట్ట‌బోయే బిడ్డ‌కు తండ్రి అంటూ..

నటి ఇలియానా ప్ర‌స్తుతం గర్భవతి. అయితే ఇప్పటి వరకూ ఆమె తన బాయ్‌ఫ్రెండ్ లేదా భాగస్వామిని గురించిన వివ‌రాలు వెల్లడించలేదు. ఈ కారణంగా ఆమె ట్రోలింగ్‌ను ఎదుర్కోవలసి వచ్చింది. పెళ్లి చేసుకోకుండానే తల్లి అయినందుకు జనాలు ఆమెను ట్రోల్ చేశారు. ఇప్పుడు ఇలియానా తొలిసారిగా త‌న బాయ్‌ఫ్రెండ్‌ని చూపించింది. ఈ ఫోటోతో పాటు భాగస్వామిని అభినందిస్తూ పోస్ట్ కూడా చేసింది. మిస్టరీ మ్యాన్‌తో ఉన్న ఫోటోను ఇలియానా డిక్రూజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ఇద్దరూ చాలా దగ్గరగా కనిపిస్తున్నారు. ఈ ఫోటో బయటకు వచ్చిన వెంటనే.. అది ఇలియానా ప్రియుడి ఫోటో అయి ఉంటుందనే చర్చ మొదలైంది. గ‌తంలో కూడా ఇలియానా తన బాయ్‌ఫ్రెండ్‌తో చేతులు పట్టుకుని ఉన్న‌ ఫోటో పెట్టింది. ఇందులో ఆమె తన ఉంగరాన్ని ప్రదర్శిస్తూ కనిపించింది. ఆ ఫోటోతో వారు నిశ్చితార్థం చేసుకున్నారనే చర్చ కూడా జ‌రిగింది.

ప్ర‌స్తుతం ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోతో పాటు సుదీర్ఘమైన‌ పోస్ట్ రాసింది. ఆమె పోస్టు ప్ర‌కారం.. 'గర్భధారణ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద వరం. నేనెప్పుడూ ఇంత అందంగా ఫీలయ్యానని అనుకోను. ఈ ప్రయాణంలో నన్ను నేను చాలా అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. నా బేబీ బంప్‌ని చూస్తుంటే నాకు చాలా ముద్దుగా అనిపిస్తుంది. నేను మిమ్మల్ని త్వరలో కలుస్తాను. నేను ఎలాంటి తల్లిని అవుతానో నాకు తెలియదు. నా ఈ ప్రయాణంలో నా ప్రియమైన వ్యక్తి చాలా సహకరించాడు. నేను బలహీనంగా ఉన్న‌ప్పుడల్లా అతను నా కన్నీళ్లను తుడిచేవాడు. రాయిలా నాకు అండగా నిలిచాడు. నన్ను నవ్వించడానికి జోకులు కూడా చెబుతాడు. ఇప్పుడు ప్రతిదీ అంత కష్టంగా అనిపించడం లేదంటూ రాసుకొచ్చింది.

2023 ఏప్రిల్ 18న ఇలియానా గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ఇలియానాకు ఇంకా వివాహం కాలేదు. అయితే తన భాగస్వామిని గురించి రహస్యంగా ఉంచింది. ఒకప్పుడు ఇలియానా ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో డేటింగ్‌లో ఉంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఆ తర్వాత కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఎఫైర్ ఉన్నట్లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.


Next Story