ఒకటి, రెండు కాదు.. 24 సీన్లను తీసేశారు

మోహన్ లాల్ నటించిన సినిమా 'L2: ఎంపురాన్' నిర్మాతలు ముస్లిం మహిళలపై హింసకు సంబంధించిన 29 సెకన్ల సన్నివేశంతో సహా 24 సన్నివేశాలను తొలగించారు.

By Medi Samrat
Published on : 1 April 2025 5:20 PM IST

ఒకటి, రెండు కాదు.. 24 సీన్లను తీసేశారు

మోహన్ లాల్ నటించిన సినిమా 'L2: ఎంపురాన్' నిర్మాతలు ముస్లిం మహిళలపై హింసకు సంబంధించిన 29 సెకన్ల సన్నివేశంతో సహా 24 సన్నివేశాలను తొలగించారు. 2019లో వచ్చిన చిత్రం లూసిఫర్ సీక్వెల్ అయిన 'L2: ఎంపురాన్' కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) క్లియర్ చేసింది మార్చి 27న విడుదలైంది. విడుదలైన వెంటనే కొన్ని సన్నివేశాలు వివాదాస్పదం అయ్యాయి. ఈ సినిమా నిర్మాతలు రైలు దహనం, అల్లర్ల సమయంలో జరిగిన క్రూరమైన హింస, "బాబా బజరంగీ" పేరు మార్పు వంటి మొత్తం 2 నిమిషాల 8 సెకన్ల నిడివిని తొలగించారు. అంతేకాకుండా కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేశారు.

L2: ఎంపురాన్ నిర్మాతలు కేంద్ర మంత్రి సురేష్ గోపి, IRS కార్యాలయం జ్యోతిష్ మోహన్, సంఘ్ పరివార్ రాజకీయాల ప్రస్తావనలు, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రెఫరెన్స్ ను కూడా సినిమాలో నుండి తొలగించారు.

Next Story