మళ్ళీ తెలుగులో నటించడానికి రెడీ అవుతున్న మోహన్ లాల్?

Mohanlal Acts in Koratala Siva Next Movie. కొరటాల శివనే మరోసారి మోహన్ లాల్తో తెలుగు సినిమా చేయించే పనిలో పడ్డాడట

By Medi Samrat  Published on  15 Feb 2021 10:41 AM GMT
Mohanlal Acts in Koratala Siva Next Movie

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ జాతీయ స్థాయి నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఆయన తెలుగు,తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించి సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మోహన్ లాల్ నటించిన చిత్రాలు ఎక్కువగా తెలుగు లో డబ్ అయ్యాయి. ఆ మద్య ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. గతంలో తెలుగులో చంద్రశేఖర్ ఏలేటి సినిమా 'మనమంతా', అలానే కొరటాల శివ తెరకెక్కించిన 'జనతా గ్యారేజ్' చిత్రాలలో నటించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మోహన్ లాల్ .

'జనతా గ్యారేజ్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇందులో మోహన్ లాల్ పాత్ర హీరో పాత్రకి ధీటుగా ఉంటుంది. సినిమాకి ఆయన రోల్ హైలైట్ గా నిలిచింది. ఇక ఆ రెండు సినిమాలు తరువాత ఇంతవరకు తెలుగులో సినిమా చెయ్యలేదు.

ఇక మళ్ళీ ఇన్నాళ్లకు తెలుగులో మరో మూవీ చెయ్యబోతున్నాడట. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో 'జనతా గ్యారేజ్' సినిమాను రూపొందించిన కొరటాల శివనే మరోసారి ఆయనతో తెలుగు సినిమా చేయించే పనిలో పడ్డాడట..ఈ ఏడాదిలోనే సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది.

రాజకీయ నేపథ్యంలోనే సాగే ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర కీలకంగా ఉంటుందట. ఆ పాత్రను మోహన్ లాల్ తో చేయించాలని కొరటాల పట్టుదలతో ఉన్నాడట. మోహన్ లాల్ తో సంప్రదింపులు జరుపుతున్నాడని.. ఈ సినిమా చెయ్యడానికి మోహన్ లాల్ అంగీకరించే ఛాన్స్ ఉందని అంటున్నారు.




Next Story
Share it