మీర్జాపూర్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్

మీర్జాపూర్ సిరీస్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ఈ సిరీస్ సీజన్ 3 కోసం ఎన్నాళ్ళ నుండో అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.

By Medi Samrat  Published on  17 Jan 2024 7:45 PM IST
మీర్జాపూర్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్

మీర్జాపూర్ సిరీస్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ఈ సిరీస్ సీజన్ 3 కోసం ఎన్నాళ్ళ నుండో అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. 'మీర్జాపూర్ సీజన్ 3' షూటింగ్ శరవేగంగా సాగుతూ ఉంది. 'మీర్జాపూర్ 3' పునరాగమనం ప్రైమ్ వీడియోలో కొత్త సిరీస్‌ను ప్రారంభించడం వల్ల కొంచెం ఆలస్యం అయింది. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నప్పటికీ, త్వరలోనే సిరీస్ సందడి చేయబోతోంది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న మీర్జాపూర్‌ 3 ఇప్పుడు పోస్ట్‌ ప్రొడక్షన్‌, డబ్బింగ్‌ పనులు జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది. మార్చి నెలలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా మీర్జా పూర్‌ సీజన్‌ 3 స్ట్రీమింగ్‌ కానుందని సమాచారం.

‘మీర్జాపూర్ సీజన్ 3’ మార్చి 2024 చివరి వారంలో ప్రదర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారికంగా విడుదల తేదీ ఇంకా ధృవీకరించబడనప్పటికీ.. అన్ని చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలుస్తోంది. మీర్జాపూర్ సీజన్ 3లో పంకజ్ త్రిపాఠి.. కాలీన్ భయ్యాగా సందడి చేయనున్నాడు. అలీ ఫజల్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న గుడ్డు పండిట్‌గా, శ్వేతా త్రిపాఠి శర్మ గజ్‌గామిని గోలు గుప్తా పాత్రలో కనిపించింది. రసిక దుగల్.. బీనా త్రిపాఠి పాత్రలో.. కథను మలుపు తిప్పబోతున్నారు. 2018 నవంబరు 16న మీర్జాపూర్‌ మొదటి సీజన్‌ రిలీజ్‌ కాగా ఊహించని రీతిలో రెస్పాన్స్‌ అందుకుంది.. ఇండియాలో అత్యధిక వ్యూస్‌ సొంతం చేసుకున్న వెబ్‌ సిరీస్ లలో ఒకటిగా నిలిచింది. ఇక దానికి సీక్వెల్ గా 2020 అక్టోబరు 23న మీర్జాపూర్‌ రెండో సీజన్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. మూడో సీజన్ కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.

Next Story