ల‌క్కీ గ‌ర్ల్‌ మెహ్రీన్ పెళ్లి ఫిక్స‌య్యింది.. వ‌రుడు ఆ మాజీ సీఎం మ‌న‌వ‌డు

Mehreen Kaur is getting engaged. టాలీవుడ్ ల‌క్కీ గ‌ర్ల్‌ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా త్వ‌ర‌లోనే పెళ్లి పీట లెక్క‌నుంది. వ‌రుడు ఆ మాజీ సీఎం మ‌న‌వ‌డు.

By Medi Samrat  Published on  14 Feb 2021 10:55 AM IST
Mehreen Kaur get engaged

టాలీవుడ్ ల‌క్కీ గ‌ర్ల్‌ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా త్వ‌ర‌లోనే పెళ్లి పీట లెక్క‌నుంది. తాను కోడ‌లిగా అడుగుపెట్ట‌నుంది మూములు కుటుంబంలోకి కాదు.. హ‌ర్యానాకు ముఖ్య‌మంత్రిగా మూడు సార్లు ప‌నిచేసిన భ‌జ‌న్‌లాల్ బిష్ణోయ్ ఇంటికి వెళ్ల‌నుంది. భ‌జ‌న్‌లాల్ బిష్ణోయ్ మ‌న‌వడు.. భ‌వ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ కౌర్ వివాహం నిశ్చ‌య‌మైంది. కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్ కుమారుడైన భ‌వ్య బిష్ణోయ్‌, మెహ్రీన్ కౌర్ పెళ్లికి పెద్ద‌లు అంగీకారం తెలిపారు.

మార్చ్ 13న రాజ‌స్థాన్ జోధ్‌పూర్‌ ప్యాలెస్‌లో వీరి నిశ్చితార్థం జ‌రు‌గ‌నుంది. ఇరు కుటుంబాల సభ్యులు మరికొందరు సన్నిహితులు మాత్రమే ఈ వేడుక హాజరుకానున్నట్లు సమాచారం. నిశ్చితార్థం అనంతరం పెళ్లి తేదీ ప్రకటించనున్నారు. కొన్నిరోజుల క్రితం భవ్య, మెహ్రీన్‌కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది.

ఇదిలావుంటే.. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయ‌మైన ఈ భామ‌.. ఆ త‌ర్వాత రాజా ది గ్రేట్‌, జ‌వాన్‌, క‌వ‌చం, మ‌హానుభావుడు. ఎఫ్‌-2, చాణ‌క్య వంటి చిత్రాల‌తో తెలుగునాట న‌టిగా గుర్తింపు పొందింది. ప్ర‌స్తుతం మెహ్రీన్ తెలుగులో ఎఫ్‌-3 సినిమాలో న‌టిస్తుంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్.. వరుణ్ తేజ్‌కు జోడీగా నటిస్తుంది.




Next Story