బాస్.. రెండు రోజుల్లో భారీ విధ్వంసమే..!

Megastar Chiranjeevi God Father Movie Collections. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుని వెళుతోంది.

By Medi Samrat
Published on : 7 Oct 2022 3:00 PM IST

బాస్.. రెండు రోజుల్లో భారీ విధ్వంసమే..!

చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుని వెళుతోంది. రెండో రోజు రూ.31 కోట్లను రాబట్టుకుంది. దీంతో మొదటి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా గాడ్ ఫాదర్ బాక్సాఫీసు వసూళ్లు రూ.69 కోట్లుగా ఉన్నాయి. గాడ్ ఫాదర్ మూవీ విజయదశమి రోజున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు ఈ సినిమాకు వచ్చిన ఆదాయం రూ.38 కోట్లు. మోహన్ రాజా దర్శకత్వంతో వచ్చిన గాడ్ ఫాదర్ రాజకీయ, డ్రామా ఆధారితంగా ఉంటుంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా నటించాడు. అలాగే, నయనతార, సత్యదేవ్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.

ఈ వారంతానికి గాడ్ ఫాదర్ సునాయాసంగానే రూ.120 కోట్ల మార్క్ ను చేరుకోవడం చాలా సులువు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ కు రీమేక్ గాడ్ ఫాదర్. అయితే టాలీవుడ్ కు తగ్గట్టుగా మార్పులు చేసి.. మాస్ యాంగిల్ ని అందించారు. అద్భుతమైన ఫస్ట్ హాఫ్ కు.. మంచి సెకండాఫ్ తోడవ్వడంతో మొదటి ఆట నుండే హిట్ అని ప్రకటించారు సినీ అభిమానులు.


Next Story