ఆచార్య ప్లాప్ ను ఎవరి మీదకు నెట్టేశారంటే..?

Megastar Chiranjeevi Comments on Acharya Movie Flop. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్ ఈ దసరాకు విడుదల కాబోతోంది.

By Medi Samrat
Published on : 1 Oct 2022 6:23 PM IST

ఆచార్య ప్లాప్ ను ఎవరి మీదకు నెట్టేశారంటే..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్ ఈ దసరాకు విడుదల కాబోతోంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కేమియో చేసిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో చిరంజీవి పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వస్తున్నారు. తాజాగా ఆచార్య ఫెయిల్యూర్ పై ఆయన స్పందించారు. ఆచార్య సినిమా చిరంజీవి కెరీర్ లోనే ఒక పెద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే..! ఆ సినిమా గురించి మాట్లాడుతూ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆచార్య పరాజయం అనేది తనను బాధించలేదని చెప్పుకొచ్చారు చిరంజీవి. ఎందుకంటే మేము డైరెక్టర్ చెప్పినట్లు చేశాము. కానీ ఒక బాధ మాత్రం ఉంది. నేను, చరణ్ మొదటిసారి కలిసి సినిమా చేశాం. అది హిట్ కాలేదు. ఒకవేళ భవిష్యత్తులో చేసినా.. ఇంత జోష్ ఉండకపోవచ్చు. అంతుకు మించి ఎలాంటి బాధలేదని చెప్పుకొచ్చారు. తన కెరీర్ ప్రారంభంలో సినిమా విజయం సాధిస్తే ఎంతో సంతోషించేవాడినని, అలాగే పరాజయం వస్తే బాధపడేవాడినని తెలిపారు. కానీ ఆ రోజులు ఇప్పుడు గడిచిపోయాయని.. మొదటి 15 సంవత్సరాల్లోనే అనేక అనుభవాలను ఎదుర్కోన్నానని, ఆ సమయంలోనే మానసికంగా.. శారీరకంగా అన్నింటినీ తట్టుకోవడం తెలుసుకున్నానని అన్నారు.


Next Story