విడాకులపై ఫస్ట్‌టైం స్పందించిన నిహారిక.. ఏం చెప్పిందో తెలుసా?

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల- జొన్నలగడ్డ చైతన్య అధికారికంగా విడిపోయారు. ఈ జంట పరస్పరం విడాకుల కోసం నెల రోజుల కిందట కోర్టులో దరఖాస్తు చేశారు.

By అంజి  Published on  5 July 2023 12:34 PM IST
Mega daughter Niharika, divorce, Chaitanya Jonnalagadd, Tollywood

విడాకులపై ఫస్ట్‌టైం స్పందించిన నిహారిక.. ఏం చెప్పిందో తెలుసా?

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల- జొన్నలగడ్డ చైతన్య అధికారికంగా విడిపోయారు. ఈ జంట పరస్పరం విడాకుల కోసం నెల రోజుల కిందట కోర్టులో దరఖాస్తు చేశారు. మంగళవారం అంటే జూలై 4న నిహారిక-చైతన్య తమ వివాహబంధానికి ముగింపు పలికనట్లు అధికారికంగా వెల్లడైంది. పరస్పర అంగీకారంతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు అయ్యాయి. తాజాగా ఈ విషయమై నిహారిక స్పందించారు. భర్త చైతన్య, తాను పరస్పర అంగీకారంతో విడాకులను తీసుకుంటున్నట్లు ఇన్స్టాగ్రామ్‌లో నిహారిక ప్రకటించారు. ఈ సున్నిత సమయంలో తమను ఇబ్బంది పెట్టవద్దని, తామిద్దరం కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితం విషయంలో ప్రైవసీని కోరుకుంటున్నామని, దీన్ని అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.

ఇంతకాలం తనకు అండగా నిలిచిన కుటుంబం, సన్నిహితులకు నిహారిక కృతజ్ఞతలు తెలిపారు. చైతన్య కూడా ఇదే విషయాన్ని ఇన్స్టాగ్రామ్‌ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం వీరి ఇన్‌స్టా పోస్ట్‌లు నెట్టింట వైరల్‌గా మారాయి. 2020 డిసెంబర్ 9న నిహారిక, చైతన్యల వివాహం ఎంతో వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీతో పాటు చైతన్య కుటుంబీకులు, పలువురు ప్రముఖుల మధ్య రాజస్థాన్‌లోని జైపూర్‌లో వీరి విహహం గ్రాండ్‌గా జరిగింది. అయితే పెళ్లైన కొన్ని నెలలకే వీరిద్దరి మధ్య మనస్పార్థలు వచ్చాయి. ఆ కొద్దిరోజులకు చైతన్య తన ఇన్ స్టా నుంచి నిహారిక ఫొటోలను తొలగించారు. దీంతో విడాకుల రూమర్లకు మరింత బలం చేరింది. ఈరోజు అధికారికంగా విడిపోతున్నట్టు ప్రకటించారు.

Next Story