'పుష్ప ది రూల్‌' టీం సెట్స్‌పైకి వెళ్తున్నారా..?

Massive Update On Sequel To Allu Arjun, Rashmika Mandanna's Pushpa. 'పుష్ప ది రూల్‌' టీం సెట్స్‌పైకి వెళ్తున్నారా..?

By Medi Samrat  Published on  12 July 2022 7:46 PM IST
పుష్ప ది రూల్‌ టీం సెట్స్‌పైకి వెళ్తున్నారా..?

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప చిత్రం ఏ రేంజ్ హిట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం 'పుష్ప ది రూల్‌' పేరుతో సెకండ్ పార్ట్ షూటింగ్ ప్రారంభించడానికి మూవీ టీమ్ ఎదురుచూస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్ ఒక‌టి స‌ర్క్యూలేట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తైంద‌ని.. ఆగస్టు 3వ వారంలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని వార్త‌లు వ‌స్తున్నాయి. మేకర్స్ లొకేషన్లను కూడా ఖరారు చేశార‌ని.. దర్శకుడు సుకుమార్ నటీనటులను లాక్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

సీక్వెల్ ఎలా ఉంటుంది?

ఈ చిత్రం రెండవ పార్ట్‌లో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ప‌హాద్ ఫాజిల్ తో పాటు ఇతర నటీనటుల పాత్రలు కూడా సీక్వెల్‌లో పునరావృతం చేస్తారని సమాచారం. ఈ పార్ట్‌లో పుష్ప రాజ్‌,షెకావత్‌కు మధ్య సంఘర్షణ హోరాహోరిగా న‌డుస్తోంద‌ని స‌మాచారం. ఏదిఏమైనా రెండ‌వ పార్ట్ అనౌన్స్‌మెంట్ కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృత‌తో వేచిచూస్తున్నారు.

















Next Story