మనోజ్ బాజ్ పాయ్ ఇంట తీవ్ర విషాదం

Manoj Bajpayee's Father RK Bajpayee Dies At 83 In Delhi. మనోజ్ బాజ్ పాయ్.. బాలీవుడ్ లోనే కాకుండా దక్షిణాదిన కూడా ఎన్నో సినిమాల్లో నటించారు.

By Medi Samrat
Published on : 3 Oct 2021 3:20 PM IST

మనోజ్ బాజ్ పాయ్ ఇంట తీవ్ర విషాదం

మనోజ్ బాజ్ పాయ్.. బాలీవుడ్ లోనే కాకుండా దక్షిణాదిన కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. తాజాగా మనోజ్ బాజ్ పాయ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మనోజ్ తండ్రి ఆర్కే బాజ్‌పేయి ఆదివారం కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. తన కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ కోసం కేరళలో ఉన్న మనోజ్ తన తండ్రి అంత్యక్రియలను నిర్వహించడానికి వెంటనే ఢిల్లీకి పయనమయ్యాడని మనోజ్ బాజ్‌పేయి ప్రతినిధి తెలిపారు.

"గత కొన్ని రోజుల నుండి మనోజ్ తండ్రి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ వార్త విన్న తర్వాత మనోజ్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం షూటింగ్ చేస్తున్న కేరళ నుండి ఢిల్లీకి వచ్చారు" అని మనోజ్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. మనోజ్ బాజ్‌పేయి తండ్రి సెప్టెంబర్‌లో ఆసుపత్రిలో చేరారు. నటుడి తండ్రి అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో నిర్వహించారు. బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో బెల్వా అనే చిన్న గ్రామంలో జన్మించిన మనోజ్‌ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరడానికి ఢిల్లీకి వచ్చాడు. తర్వాత అవకాశాల కోసం ముంబైకి చేరాడు. మనోజ్ ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలోనూ, సినిమాల్లోనూ నటిస్తూ ఉన్నాడు.


Next Story