మంగళవారం సినిమా ఓటీటీ విడుదల.. ఎప్పుడంటే.?

పాయల్‌ రాజ్‌పూత్ ప్రధాన పాత్రలో న‌టించిన తాజా చిత్రం ‘మంగళవారం. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్‌ భూపతి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

By Medi Samrat  Published on  16 Dec 2023 4:49 PM IST
మంగళవారం సినిమా ఓటీటీ విడుదల.. ఎప్పుడంటే.?

పాయల్‌ రాజ్‌పూత్ ప్రధాన పాత్రలో న‌టించిన తాజా చిత్రం ‘మంగళవారం. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్‌ భూపతి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్‌ 17న విడుదలై బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వసూళ్లను అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది .ప్రముఖ ఓటీటీ దిగ్గ‌జం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్ ఈ సినిమా ఓటీటీ హక్కుల‌ను ద‌క్కించుకుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌పై డిస్నీ నిర్వ‌హ‌కులు అధికారికంగా ప్ర‌క‌టించనున్నారు. ఈ సినిమా క్రిస్మస్ కు కాస్త అటు ఇటుగా స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలుస్తుంది. డిసెంబర్ 26 అని మాత్రం ప్రచారం సాగుతోంది. త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజయ్‌ ఘోష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటి వరకూ టాలీవుడ్ లో ఎవరూ టచ్ చేయని సబ్జెక్టు తో ఈ సినిమాను తీశాడు దర్శకుడు అజయ్ భూపతి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. సెకండాఫ్ లో కొన్ని అనవసరమైన సీన్లు తీసేసి ఉంటే బాగుండేది అని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ సినిమా కమర్షియల్ సక్సెస్ ను అందుకుంది. టేకింగ్ పరంగా అజయ్ భూపతి మహా సముద్రం ఫ్లాప్ నుండి బయటపడ్డాడు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు.

Next Story