బాలకృష్ణ సపోర్ట్ తనకేనని అంటున్న మంచు విష్ణు

Manchu Vishnu Tweet About Balakrishna. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు మాంచి ఊపు మీద ఉన్నాయి.

By Medi Samrat  Published on  3 Oct 2021 2:24 PM IST
బాలకృష్ణ సపోర్ట్ తనకేనని అంటున్న మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు మాంచి ఊపు మీద ఉన్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు తమ తమ ప్యానల్ సభ్యులను ప్రకటించారు. జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తానని చెప్పిన బండ్ల గణేష్.. అధ్యక్ష పదవి కోసం నిలిచిన సీవీఎల్ సైతం తమ నామినేషన్స్ ఉపసంహరించుకున్నారు మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మాత్రమే పోటీలో ఉన్నారు. ఇప్పటికే వీరి ఇరువురి ప్యానల్ సభ్యులు బహిరంగ విమర్శలు చేసుకున్నారు.

ఇప్పటికే రెండు ప్యానల్స్ పలువురు ప్రముఖులను కలుసుకున్నాయి. తాజాగా మంచు విష్ణు తాను నందమూరి బాలకృష్ణను కలుసుకున్నట్లు ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. మీరు నా వెనుక ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని మంచు విష్ణు బాలయ్యతో ఉన్న ఫోటోలను షేర్ చేసుకున్నారు. బాలయ్య అఖండ మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడు మంచు విష్ణు వెళ్లి కలిసినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు మంచు విష్ణు మాట్లాడుతూ తనకు ఓ సీనియర్ హీరో అండ ఉందని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే..!

అక్టోబర్ 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మా ఎన్నికలు జరుగనున్నాయి. ఈసారి మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు పోటీ పడుతుండగా.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి విష్ణు ప్యానల్ నుంచి బాబు మోహన్, ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ పోటీ చేస్తున్నారు. అసోసియేషన్‏లో 18 ఈసీ పోస్టులకు మొత్తం 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు


Next Story