స్పందించిన మంచు విష్ణు.. ఏమన్నాడంటే..?

Manchu Vishnu responded About Fight. మంచు వారి కుటుంబంలో జరిగిన గొడవపై మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు.

By Medi Samrat
Published on : 24 March 2023 10:02 AM

స్పందించిన మంచు విష్ణు.. ఏమన్నాడంటే..?

Manchu Vishnu, Manchu Manoj



మంచు వారి కుటుంబంలో జరిగిన గొడవపై మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. ‘‘మా మధ్య జరిగింది సాధారణ గొడవే. ఉద‌యం ఆఫీసులో జ‌రిగిన చిన్న ఘ‌ట‌న. సార‌థి వాగ్వాదాన్ని మ‌నోజ్ ఆప‌లేక‌పోయాడు. మ‌నోజ్ చిన్న‌వాడు. ఇదేమంత పెద్ద గొడ‌వ కాదు. స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నాను’’ అని విష్ణు చెప్పుకొచ్చారు.

మంచు విష్ణు, మంచు మనోజ్ మ‌ధ్య విభేదాల‌కు సంబంధించి ఓ వీడియో ప్ర‌స్తుతం హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మంచు మ‌నోజ్ షేర్ చేసిన ఈ వీడియోలో.. "ఇళ్ల‌లోకి వ‌చ్చి మా వాళ్ల‌ను, బంధువుల‌ను ఇలా కొడుతుంటారండి. ఇది ఇక్క‌డి ప‌రిస్థితి అంటూ" మ‌నోజ్ చెబుతుండ‌గా విష్ణు ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు క‌నిపించారు.

వీడియో వైర‌ల్‌గా మార‌డంతో మోహ‌న్‌బాబు కుమారులు ఇద్ద‌రిపై సీరియ‌స్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో మనోజ్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా స్టోరీస్‌లో స్టేటస్‌గా పెట్టిన ఈ వీడియోను కొద్దిసేపటి తర్వాత తొలగించాడు. కుటుంబంలో అన్న‌ద‌మ్ములు మ‌ధ్య చిన్న చిన్న గొడ‌వ‌లుండ‌టం సాధార‌ణ విష‌య‌మ‌ని, ఆవేశం అన‌ర్థానికి దారి తీస్తుంద‌నే విష‌యాన్ని త‌న కొడుకులు అర్థం చేసుకోలేక‌పోతున్నార‌ని మంచు మోహన్ బాబు తెలిపారు.


Next Story