Manchu Brothers : మంచు బ్రదర్స్‌ మధ్య విభేదాలు.. వీడియో షేర్ చేసిన మ‌నోజ్‌.. మండిప‌డ్డ మోహ‌న్ బాబు..!

మంచు సోద‌రుల‌కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 March 2023 2:02 PM IST
Manchu Brothers : మంచు బ్రదర్స్‌ మధ్య విభేదాలు.. వీడియో షేర్ చేసిన మ‌నోజ్‌.. మండిప‌డ్డ మోహ‌న్ బాబు..!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌నదైన ముద్ర వేసిన న‌టుల్లో మంచు మోహ‌న్ బాబు ఒక‌రు. ఆయ‌న ఫ్యామిలీ నుంచి మంచు విష్ణు, మంచు మ‌నోజ్‌, మంచు ల‌క్ష్మీ లు ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చారు. అయితే.. తండ్రిలా వారు రాణించ‌లేక‌పోతున్నారు. ఈ విష‌యాన్ని కాస్త ప‌క్క‌న బెడితే.. అన్న‌ద‌మ్ములు మంచు విష్ణు, మంచు మ‌నోజ్‌ల మ‌ధ్య విభేదాలు ఉన్నాయంటూ గ‌త కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే ఇటీవ‌ల మంచు మ‌నోజ్ రెండో వివాహంలో విష్ణు అంటీముట్ట‌న‌ట్లుగా ఉన్నాడ‌ని వార్త‌లు వినిపించాయి.

వాటిని నిజం చేస్తూ అన్నాద‌మ్ముల మ‌ధ్య విభేదాల‌కు సంబంధించి ఓ వీడియో ప్ర‌స్తుతం హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మంచు మ‌నోజ్ షేర్ చేసిన ఈ వీడియోలో.. "ఇళ్ల‌లోకి వ‌చ్చి మా వాళ్ల‌ను , బంధువుల‌ను ఇలా కొడుతుంటారండి. ఇది ఇక్క‌డి ప‌రిస్థితి అంటూ" మ‌నోజ్ చెబుతుండ‌గా విష్ణు ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు క‌నిపించారు. ఈ వీడియో వైర‌ల్‌గా మార‌డంతో ఇంటి గుట్టును బ‌య‌ట పెడుతున్నారంటూ మోహ‌న్‌బాబు కుమారులు ఇద్ద‌రిపై సీరియ‌స్ అయిన‌ట్లుగా తెలుస్తోంది.

దీంతో మనోజ్‌.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా స్టోరీస్‌లో స్టేటస్‌గా పెట్టిన ఈ వీడియోను కొద్దిసేపటి తర్వాత తొలగించాడు. అసలు ఏం జ‌రిగింది..? అన్న ద‌మ్ముల మ‌ధ్య‌ గొడ‌వ‌లు ఎందుకు వ‌చ్చాయి అన్న సంగ‌తి ఎవ‌రో ఒక‌రు స్పందిస్తే త‌ప్ప తెలియ‌దు.

Next Story