ప్రెస్ మీట్ పెట్టిన మంచు విష్ణు.. ఆ విషయంలో ఆవేదన
Manchu Vishnu Press Meet. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరుగనుండడంతో ఈసారి
By Medi Samrat Published on 24 Sept 2021 6:45 PM IST
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరుగనుండడంతో ఈసారి 'మా' అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులను పరిచయం చేశారు. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ కూడా పెట్టారు. 'మా'లో మార్పు తీసుకొస్తానని.. ప్రతి ఒక్కరికి మెడికల్ ఇన్సురెన్స్ కల్పిస్తాం అని విష్ణు అన్నారు. మా సభ్యులు గ్రూపులుగా విడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తీరుపై ఎవరూ సంతోషంగా లేరని, ఎన్నికల గురించి మీడియా, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రావడం బాధకరమన్నారు. ఇక తన ప్యానల్‌లో మహిళలకు పెద్ద పీట వేస్తున్నట్లు మంచు విష్ణు పేర్కొన్నారు.
అసోసియేషన్‌లో ఉన్న 900మందికీ లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వడమే తన ప్రాధాన్యమని చెప్పుకొచ్చారు విష్ణు. ఎడ్యుకేషన్ పాలసీ గురించి అవతలి వాళ్లు మాట్లాడటానికి వస్తే తాను కూడా సిద్ధమని అన్నారు. కెమెరా ముందు ఉన్నప్పుడు నాకు కలిగే ఆనందం మరెప్పుడూ కలగదని.. ప్రతి ఒక్కరికీ పని కల్పించడమే నా లక్ష్యమని తెలిపారు. 900 మంది ఒక కుటుంబం.. ఈ ఎన్నికల వ్యవహారం మీడియా ముందుకు వచ్చి ఉండకూడదు.. కానీ, ఆలస్యమైపోయిందని అన్నారు. 900 మంది 2000 మంది కావాలి.. కొత్త టాలెంట్ ఇండస్ట్రీలోకి రావాలని అన్నారు. కొత్తగా ఓటీటీ వేదికలు వస్తున్నాయి. వాళ్లనూ కలవాలని మంచు విష్ణు తెలిపారు.పని కలిగించడమే నా అజెండా.. అదే నా ప్రాధాన్యం అని విష్ణు చెప్పుకొచ్చారు. బాబూమోహన్, పృథ్వీలాంటి సీనియర్ నటుల అనుభవం నాకు కావాలి. శివ బాలాజీ లాంటి యువరక్తం 'మా' అభివృద్ధికి అవసరమని విష్ణు చెప్పారు.