మంచు లక్ష్మి ఇంట్లోనే మనోజ్ పెళ్లి.. కారణం ఏమిటంటే..?

Manchu Manoj Wedding. మంచు మనోజ్‌, భూమా మౌనికల పెళ్లి మార్చి 3 రాత్రి 8.30 గంటలకు మంచు లక్ష్మి స్వగృహంలో జరగనుంది.

By Medi Samrat  Published on  3 March 2023 7:20 PM IST
మంచు లక్ష్మి ఇంట్లోనే మనోజ్ పెళ్లి.. కారణం ఏమిటంటే..?

Manchu Manoj Wedding


మంచు మనోజ్‌, భూమా మౌనికల పెళ్లి మార్చి 3 రాత్రి 8.30 గంటలకు మంచు లక్ష్మి స్వగృహంలో జరగనుంది. మనోజ్‌ పెళ్లిని స్వయంగా మంచు లక్ష్మి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫంక్షన్‌ హాల్‌లో కాకుండా లక్ష్మి ఇంట్లో పెళ్లి నిర్వహిస్తూ ఉన్నారు. మనోజ్‌ అంటే చాలా ఇష్టమని, తనను కొడుకులా చూసుకుంటానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన మంచు లక్ష్మీ.. పెళ్లి పనులు అన్నీ తనే దగ్గరుండి నిర్వహిస్తోంది. అందుకే పెళ్లి కూడా తన ఇంట్లో చేయాలని మంచు లక్ష్మీ నిర్ణయించుకుని.. ఈ పని చేస్తోంది.

మంచు మ‌నోజ్ త‌న‌కు కాబోయే భార్య ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. భూమా మౌనిక రెడ్డిని ఈ రోజు(శుక్ర‌వారం) పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించాడు. పెళ్లికూతురుగా తయారైన మౌనిక రెడ్డి ఫోటోను ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ‘మనోజ్ వెడ్స్ మౌనిక’ అంటూ హార్ట్ సింబల్ ను పోస్ట్ చేశాడు. అతి కొద్ది మంది బంధుమిత్రులు, సినీ రాజ‌కీయ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో మ‌నోజ్‌-మౌనిక‌లు పెళ్లి చేసుకోబోతున్నారు. గ‌తంలో మ‌నోజ్‌కు ప్ర‌ణ‌తి అనే అమ్మాయితో వివాహం జ‌రుగ‌గా.. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. అటు మౌనిక‌కు కూడా ఇదివ‌ర‌కే పెళ్లై, విడాకులయ్యాయి.


Next Story