అఫీషియల్.. మనోజ్ వెడ్స్ మౌనిక.. కాబోయే భార్య ఫోటో పోస్ట్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని నేడు వివాహం చేసుకోబోతున్నాడు.
By తోట వంశీ కుమార్ Published on 3 March 2023 11:02 AM ISTమనోజ్ వెడ్స్ మౌనిక
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ వార్తలపై ఇప్పటి వరకు స్పందించని మనోజ్ తాజాగా అసలు విషయం చెప్పేశాడు. తనకు కాబోయే భార్య ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. భూమా మౌనిక రెడ్డిని ఈ రోజు(శుక్రవారం) పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. పెళ్లికూతురుగా తయారైన మౌనిక రెడ్డి ఫోటోను ట్విటర్‌లో షేర్ చేశారు. ‘మనోజ్ వెడ్స్ మౌనిక’ అంటూ హార్ట్ సింబల్ ను పోస్ట్ చేశాడు.
Pellikuthuru @BhumaMounika ❤️#MWedsM #ManojWedsMounika 🙏🏼❤️ pic.twitter.com/eU6Py02jWt
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 3, 2023
మంచు లక్ష్మీ నివాసంలో ఈ రోజు రాత్రి 8.30గంటలకు మనోజ్ పెళ్లి జరగనుంది. అతి కొద్ది మంది బంధుమిత్రులు, సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో మనోజ్-మౌనికలు ఏడుఅడుగులు వేయబోతున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
గతంలో మనోజ్‌కు ప్రణతి అనే అమ్మాయితో వివాహం జరుగగా మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. అటు మౌనికకు కూడా ఇదివరకే పెళ్లై, విడాకులైన విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే మనోజ్ ప్రస్తుతం "వాట్ ది పిష్" అనే చిత్రంలో నటిస్తున్నాడు.