మంచు మనోజ్ పెట్టిన పోస్ట్.. దేనికి సంకేతం..!

Manchu Manoj Tweet Goes Viral. మంచు మనోజ్.. మనసున్న మనిషి అని అందరూ అంటూ ఉంటారు.

By Medi Samrat  Published on  8 Jan 2023 10:46 AM GMT
మంచు మనోజ్ పెట్టిన పోస్ట్.. దేనికి సంకేతం..!

మంచు మనోజ్.. మనసున్న మనిషి అని అందరూ అంటూ ఉంటారు. ఆయన పర్సనల్ లైఫ్ లో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఏడాది వినాయక చవితి సమయంలో మనోజ్, మౌనిక కలిసి పూజలు నిర్వహించారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కథనాలు వచ్చాయి. మంచు మనోజ్ కూడా మౌనికతో రిలేషన్ షిప్ లో లేననే విషయమైతే మీడియాతో చెప్పలేదు. అన్నీ త్వరలోనే తెలుస్తాయి అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు. కడప దర్గాకి వెళ్లిన మంచు మనోజ్ త్వరలో కొత్త జీవితం మొదలు పెడుతున్నా, ఈసారి ఇక్కడికి కుటుంబంతో వస్తానని చెప్పేసి వెళ్లారు.

నేడు మౌనిక రెడ్డి తండ్రి స్వర్గీయ భూమా నాగిరెడ్డి జన్మదినం కావడంతో, మనోజ్ ఆయన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 'ఆయన ఒక గొప్ప లీడర్ మాత్రమే కాదు.. ఒక గొప్ప కొడుకు, భర్త, తండ్రి అంతకుమించి ఒక గొప్ప మనుసు ఉన్న వ్యక్తి. ఆయనే భూమా నాగిరెడ్డి గారు. ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన అశీసులు మాత్రం ఎప్పుడు మనపైనే ఉంటాయి' అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. అంకుల్ అంటూ సంబోధించి త్వరలోనే మనోజ్, మౌనిక రెడ్డితో పెళ్లి జరగడం ఖాయం అనే వార్తలకు బలం చేకూర్చారు.


Next Story