సినీ పరిశ్రమలో కరోనా కలకలం.. మంచు మనోజ్‌కు పాజిటివ్‌

Manchu manoj tested corona positive. కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. ఓమిక్రాన్‌ విజృంభణతో పాటు కరోనా కేసులు పెరుగుతుండటం అందరి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

By అంజి  Published on  29 Dec 2021 12:32 PM IST
సినీ పరిశ్రమలో కరోనా కలకలం.. మంచు మనోజ్‌కు పాజిటివ్‌

కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. ఓమిక్రాన్‌ విజృంభణతో పాటు కరోనా కేసులు పెరుగుతుండటం అందరి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తాజాగా టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని మంచు మనోజ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అయితే ఎలాంటి ఆందోళన అవసరం లేదని, తన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని మంచు మనోజ్‌ చెప్పారు. కాగా ఇటీవల తనను కలిసిన వారు వెంటనే కరోనా టెస్టులు చేయించుకోవాలని మనోజ్‌ కోరారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశాడు. కరోనా వైరస్‌ గురించి జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

తన గురించి ఆందోళన అక్కర్లేదని, తాను బాగానే ఉన్నానని చెప్పారు. మీ ప్రేమ, అశీర్వాదాలే నా బలం అని, కొవిడ్‌ టైమ్‌లో జాగ్రత్తగా చూసుకుంటున్న డాక్టర్లు, నర్సులకు మంచు మనోజ్‌ కృతజ్ఞతలు తెలిపాడు. మోహన్‌ బాబు వారసుడిగా మంచు మనోజ్‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తన భార్య ప్రణతితో డైవర్‌ తీసుకున్నాడు. అప్పటి నుండి మంచు మనోజ్‌ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇటీవల దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రీసెంట్‌గా కమల హాసన్‌, కరీనా కపూర్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తో పాటు పలువురు కరోనా బారిన పడ్డారు.


Next Story