నాలోని వేడితో.. నా నడుం మీద చపాతీ కాలుస్తానన్నాడు: మల్లికా షెరావత్‌.!

Mallika Sherawat Reveals A Producer Once Wanted To Heat Chapatis On Her Waist To Prove She’s Hot. బోల్డ్‌ బ్యూటీ మల్లికా షెరావత్‌ బాలీవుడ్‌ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. సినిమా ఎంపికలోనూ

By అంజి  Published on  11 Nov 2021 11:55 AM GMT
నాలోని వేడితో.. నా నడుం మీద చపాతీ కాలుస్తానన్నాడు: మల్లికా షెరావత్‌.!

బోల్డ్‌ బ్యూటీ మల్లికా షెరావత్‌ బాలీవుడ్‌ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. సినిమా ఎంపికలోనూ ఆమె మిగతా హీరోయిన్లకు భిన్నంగా వ్యవహరిస్తూ ఓ వెలుగు వెలిగింది. జాకీచాన్‌ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ది లైవ్‌ లవ్‌ లాఫ్‌ షోలో మల్లికా షెరావత్‌ పాల్గొంది. ఈ సందర్భంగా తనతో ఓ ప్రొడ్యూసర్‌ వ్యహరించిన తీరును ఫన్నీగా చెప్పింది. పాట సీక్వెన్స్ ఆలోచనతో నిర్మాత తన వద్దకు వచ్చాడని మల్లికా షెరావత్ వెల్లడించింది.

ఇది చాలా హాట్ సాంగ్. ప్రేక్షకులకు మీరు హాట్ అని ఎలా తెలుస్తుంది? మీరు మీ నడుముపై చపాతీలు వేడి చేసేంత వేడిగా ఉన్నారు అని మల్లికాతో ప్రొడ్యూసర్ అన్నాడట. అయితే అప్పుడు ప్రొడ్యూసర్‌ పంచుకున్న ఈ వింత ఆలోచనను మల్లికా తిరస్కరించింది. ఇది ఫన్నీగా మాట్లాడిన విషయమని చెప్పింది. మల్లికా షెరావత్‌ మాట్లాడుతూ.. నేను నా కాలును కిందకు దించాను. లేదు మనం అలాంటిదేమీ చేయడం లేదు అన్నాను. అని అంది. దీంతో అక్కడ ఉన్న సినిమా యూనిట్‌ ఒకటే నవ్వుకున్నారట.

Next Story
Share it