సినీ ఇండ‌స్ట్రీలో విషాదం.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌

మలయాళ దర్శకుడు సుధీర్ బోస్ క‌న్నుమూశారు. 53 ఏళ్ల సుధీర్ బోస్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆయ‌న తుది శ్వాస విడిచారు

By Medi Samrat  Published on  2 July 2024 3:11 PM IST
సినీ ఇండ‌స్ట్రీలో విషాదం.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌

మలయాళ దర్శకుడు సుధీర్ బోస్ క‌న్నుమూశారు. 53 ఏళ్ల సుధీర్ బోస్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆయ‌న తుది శ్వాస విడిచారు. ఆయ‌న‌కు భార్య ప్రీత, పిల్లలు మిధున్, సౌపర్ణిక ఉన్నారు. డైరెక్టర్స్ యూనియన్ అధికారిక ఫేస్‌బుక్ హ్యాండిల్ ద్వారా సుధీర్ బోస్ మరణ వార్తను పంచుకుంది, “కలాభవన్ మణి, ముఖేష్, రంభ నటించిన ‘కబడ్డీ కబడ్డీ’ దర్శకుడు సుధీర్ బోస్ సోమవారం తుది శ్వాస విడిచారని వెల్ల‌డించింది.

1971లో కేశవన్ నాయర్, సుధా దేవి దంపతులకు జన్మించిన సుధీర్ బోస్.. ప్రముఖ చిత్రనిర్మాతలు జెస్సీ, పిజి విశ్వంభరన్‌ల మార్గదర్శకత్వంలో సహాయ దర్శకుడిగా తన వృత్తిని ప్రారంభించారు. దర్శకుడు మనుతో అతని సాన్నిహిత్యం 2008లో దివంగత కళాభవన్ మణి, ముఖేష్, రంభ నటించిన ‘కబడ్డీ కబడ్డీ’ చిత్రాన్ని రూపొందించడానికి దారితీసింది. ఈ చిత్రంలో నటీనటులు హరిశ్రీ అశోకన్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రన్ పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో పాట‌లు మంచి హిట్ అయ్యాయి.

Next Story