నటి మీరా జాస్మిన్ ఇంట్లో తీవ్ర విషాదం

ప్రముఖ నటి మీరా జాస్మిన్ కుటుంబంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్ (83) అనారోగ్యంతో కన్నుమూశారు.

By Medi Samrat  Published on  4 April 2024 8:30 PM IST
నటి మీరా జాస్మిన్ ఇంట్లో తీవ్ర విషాదం

ప్రముఖ నటి మీరా జాస్మిన్ కుటుంబంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్ (83) అనారోగ్యంతో కన్నుమూశారు. ఎర్నాకులంలో ఆయన తుది శ్వాస విడిచారు. జోసెఫ్‌- ఏలియమ్మ జోసెఫ్ దంపతులకు మీరా జాస్మిన్‌తో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. జోసెఫ్ ఫిలిప్ చాలా సంవత్సరాలు ముంబైలో నివసించేవారు. తరువాత తిరుమలలో, ఆపై ఎర్నాకులంలోని తన స్వగ్రామంలో నివసించారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఇలంతూరు మర్థోమా పెద్దపల్లి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మీరా జాస్మిన్ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ చిత్రాలలో నటించింది. 2001లో లోహితదాస్ దర్శకత్వం వహించిన సూత్రధారన్ చిత్రం ద్వారా మీరా మలయాళంలో అడుగుపెట్టింది. ఈ చిత్రానికి పెద్దగా స్పందన రాకపోయినా ఇతర భాషల్లో ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. గుడుంబా శంకర్‌, భద్ర, గోరింటాకు.. సినిమాలలో నటించి తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. 2014లో దుబాయ్‌ ఇంజనీర్‌ అనిల్‌ జాన్‌ను పెళ్లాడింది. ఇటీవలే ఆమె మళ్లీ సినిమాలలో నటించడం మొదలుపెట్టింది.

Next Story