పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ లాంటి వార్త..!
పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అంటే 'గబ్బర్ సింగ్' అనే చెప్పొచ్చు.
By Medi Samrat
పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అంటే 'గబ్బర్ సింగ్' అనే చెప్పొచ్చు. ఆయన అభిమాని హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మరో సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే త్వరలోనే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ ను కూడా పూర్తీ చేయబోతున్నారు.
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని నిర్మాతలు తెలిపారు. చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ గురించి అధికారిక అప్‌డేట్ లేదు. అయితే, పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుండడంతో PSPK అభిమానులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. పవన్ ఇటీవలే హరి హర వీర మల్లు సినిమాను పూర్తి చేశాడు, OG సెట్స్‌లో కూడా చేరాడు. వీలైనంత త్వరగా ఉస్తాద్ సెట్స్ కు కూడా తిరిగి వస్తాడని నిర్మాతల తాజా ప్రకటన తెలిపింది.