మేజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. మహేష్ బాబు చెప్పేశాడు

MAJOR Movie In cinemas Feb 11 2022. మేజర్.. అడివి శేష్ హీరోగా నటిస్తున్న సినిమా..! మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా

By Medi Samrat  Published on  3 Nov 2021 6:50 AM GMT
మేజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. మహేష్ బాబు చెప్పేశాడు

మేజర్.. అడివి శేష్ హీరోగా నటిస్తున్న సినిమా..! మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శశికిరణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం 'మేజర్' పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం కొత్త విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన వచ్చింది. 'మేజర్' చిత్రం 2022 ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నారు. 'మేజర్' విడుదల తేదీని ప్రకటిస్తూ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు.75 లొకేషన్లలో 120 రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కోసం 8 భారీ సెట్లు నిర్మించామని చిత్ర బృందం తెలిపింది. అడివి శేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం ఇది.

శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేజర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ 'మేజర్'లో ముఖ్యమైన పాత్రలు పోషించారు. జిఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్, ఏ+ఎస్ మూవీస్ బ్యానర్ లపై 'మేజర్‌'ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజువల్స్ విషయంలో హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రోమోలను చూస్తుంటే మనకు అర్థమవుతోంది. తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 26/11 జ‌రిగిన ముంబై ఉగ్ర‌వాద‌ దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ప్ర‌జ‌ల‌ను కాపాడిన ఎన్ఎస్‌జీ క‌మెండో ఉన్ని కృష్ణ‌న్ పాత్ర‌ను ఈ చిత్రంలో అడివిశేష్ పోషిస్తున్నారు. కేవ‌లం ముంబై దాడుల నేప‌థ్యంతోనే కాకుండా ఉన్ని కృష్ణ‌న్ జీవితాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Next Story
Share it