మనిషికి రోగం.. కంప్యూటర్ కు వైరస్ అంటున్న ప్రియదర్శి!
Mail Movie Trailer. సాధారణంగా మనిషికి ఏదైనా రోగం వస్తే ఎలా ఇబ్బంది పడతామో, కంప్యూటర్ కి కూడా వైరస్ సోకితే.
By Medi Samrat Published on 9 Jan 2021 2:25 PM ISTసాధారణంగా మనిషికి ఏదైనా రోగం వస్తే ఎలా ఇబ్బంది పడతామో, కంప్యూటర్ కి కూడా వైరస్ సోకితే, కంప్యూటర్ లో కొన్ని సమస్యలు తలెత్తుతాయి అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే ప్రతి ఒక ఇంటిలో కంప్యూటర్లు ఉన్నాయి. కానీ కంప్యూటర్లు వచ్చిన కొత్త రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవి అనే విషయాల గురించి ఎంతో అద్భుతంగా తెరకెక్కించి చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఉదయ్ గుర్రాల.
మనుషులకు రోగం ఎలాగో.. కంప్యూటర్లకు వైరస్ అలాగే అంటున్నారు ప్రియదర్శి. ప్రియదర్శి కీలక పాత్రగా తెరకెక్కుతున్న "మెయిల్" చిత్రాన్ని దర్శకుడు ఉదయ్ గుర్రాల తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో భాగంగా "2005.. అప్పుడప్పుడే పల్లెల్లో కంప్యూటర్లు పరిచయమవుతున్న రోజులు" అంటూ సాగే ఈ ట్రైలర్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదిక అయిన "ఆహా" యాప్ ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం చిత్రబృందం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో భాగంగా సినిమా వచ్చిన తొలి రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని దర్శకుడు చక్కగా తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. అయితే సినిమా ఎలా ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.