చెమటోడుస్తున్న మ‌హేష్‌.. మ‌రీ ఇంత క‌ష్ట‌మా..?

Mahesh Workout Video Goes Viral. టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు.. వయసు పెరుగుతున్న కొద్దీ యువ‌కుడిలా క‌నిపిస్తున్నాడు దానికి ఎంత చెమటోడుస్తున్నాడో తాజా వీడియో చెబుతుంది

By Medi Samrat  Published on  21 Jan 2021 11:38 AM IST
Mahesh Workout Video Goes Viral

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు.. వయసు పెరుగుతున్న కొద్దీ యువ‌కుడిలా క‌నిపిస్తున్నాడు. స్మార్ట్‌గా, స్లిమ్‌గా హాలివుడ్ హీరో త‌ర‌హాలో కనిపిస్తున్నాడు. అయితే అలా క‌న‌ప‌డ‌టం వెనుక ఎంత చెమటోడుస్తున్నాడో తాజా వీడియో చెబుతుంది. మూములుగా మహేష్ వ‌ర్క‌వుట్స్‌కు సంబంధించిన విశేషాల‌ను అత‌ని స‌తీమ‌ణి నమత్ర అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూవుంటారు.



అయితే.. తాజాగా తాను జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోను మహేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఆ వీడియోలో మహేష్ బాక్స్ జంప్ చేస్తున్నాడు. మీ ఆటను మరింత పెంచండి.. సరిహద్దులు చెరిపేయండి.. ఎక్కడా ఆగకండి అంటూ ఆ వీడియోకు క్యాప్ష‌న్‌ను జ‌త‌ చేశాడు. ఈ వీడియో కొద్ది స‌మ‌యంలోనే తెగ వైర‌ల్ అయ్యింది. త‌మ అభిమాన హీరో ఫిట్‌నెస్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మ‌హేష్ క‌ష్టాన్ని మెచ్చుకుంటున్నారు.


Next Story