మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..

Mahesh Movie Shooting Starts From November 2nd Week. సూపర్ స్టార్ మహేష్ బాబు తన బిజీ లైఫ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని,

By Sumanth Varma k  Published on  31 Oct 2022 2:15 PM GMT
మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..

సూపర్ స్టార్ మహేష్ బాబు తన బిజీ లైఫ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని, ఫ్యామిలీతో కలిసి లండన్ కి వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఐతే, ఈ రోజు మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి లండన్ నుంచి హైదరాబాద్ కి తిరిగి వచ్చాడు. ఈ ఉదయం హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో మహేష్ తన ఫ్యామిలీతో కనిపించి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇక మహేష్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన వెంటనే.. త్రివిక్రమ్ తో తాను చేస్తున్న సినిమా పై ఫోకస్ పెట్టాడు. త్వరలోనే ఈ సినిమా రెండో షెడ్యూల్ సెట్ వర్క్ ప్రారంభం కానుంది. అలాగే నవంబర్ 2వ వారం నుంచి రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది.

పూజా హెగ్డే కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్ కానుంది. మహేష్ - పూజా లపై ఓ లవ్ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారు. అన్నట్టు జాతి ర‌త్నాలు' ఫేమ్ ఫ‌రియా అబ్దుల్లా కూడా ఈ చిత్రంలో నటించబోతుంది. ఇక చాలా కాలం తర్వాత త్రివిక్రమ్ తో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు. అందుకే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ఈ సినిమాలో రెండు బలమైన నేపథ్యాలు ఉన్నాయి. ఒకటి, ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం కాగా, మరొకటి పలనాటి ప్రాంతానికి సంబంధించిన యాక్షన్ నేపథ్యం. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక ఏప్రిల్ 28, 2023 న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ చిత్రం, తాజాగా ఏప్రిల్ నుంచి వాయిదా పడినట్లు తెలుస్తోంది.


Next Story
Share it