సుదీర్ఘ నిరీక్షణకు తెర‌ప‌డింది.. మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమా విడుదల తేదీ ఫిక్స్‌

Mahesh Babu's Sarkaru Vaari Paata Release Date Is Out. సూపర్ స్టార్ మహేష్ బాబు న‌టిస్తున్న సినిమా 'సర్కారు వారి పాట' విడుదల తేదీని

By Medi Samrat  Published on  31 Jan 2022 3:37 PM GMT
సుదీర్ఘ నిరీక్షణకు తెర‌ప‌డింది.. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా విడుదల తేదీ ఫిక్స్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు న‌టిస్తున్న సినిమా 'సర్కారు వారి పాట' విడుదల తేదీని ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌. ఈ శుభవార్త కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మేకర్స్ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. ఈ వేసవిలోనే సినిమా థియేటర్లలోకి తీసుకురావడానికి సిద్ద‌మ‌వుతున్న‌ట్లు వారు తెలిపారు. ఈ సంద‌ర్భంగా మహేష్ బాబు సూపర్ కూల్ పోస్టర్‌ను షేర్ చేయడంతో పాటు.. "మే 12న సూపర్‌స్టార్ #SarkaruVaariPaata" ప్రపంచవ్యాప్తంగా ధియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఓ సుందరమైన లొకేషన్‌లో దోసకాయ ముక్కలను కళ్లపై పెట్టుకుని రిలాక్స్ అవుతున్న మహేష్ బాబు ఫోటోను కూడా షేర్ చేశారు.

సర్కారు వారి పాటకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌తో కలిసి మహేష్ బాబు యొక్క GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ కథానాయికగా కనిపించనుంది. వెన్నెల కిషోర్, సుబ్బరాజు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలావుంటే.. మహేష్ బాబు ఇటీవల కోవిడ్ -19 బారిన ప‌డ‌టంతో షూటింగ్ నుండి విరామం తీసుకున్నాడు. ఆపై కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ వెకేషన్ కోసం దుబాయ్ వెళ్ళాడు. ఇప్పుడు అంతా సవ్యంగా ఉండ‌టంతో షూటింగ్‌ని రీస్టార్ట్ చేసి చివరి షెడ్యూల్‌ని త్వరలో ముగించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండ‌గా.. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్నారు.


Next Story