భారీ ప్లాన్ చేశారు.. రీరిలీజ్ ప్రీమియర్లు

మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా క్లాసిక్ గా నిలిచిన 'అతడు' సినిమా తిరిగి విడుదల కానుంది.

By Medi Samrat
Published on : 2 Aug 2025 8:15 PM IST

భారీ ప్లాన్ చేశారు.. రీరిలీజ్ ప్రీమియర్లు

మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా క్లాసిక్ గా నిలిచిన 'అతడు' సినిమా తిరిగి విడుదల కానుంది. ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంది. అభిమానులలో అద్భుతమైన క్రేజ్ కారణంగా, 'అతడు' సినిమాకు ప్రీమియర్లు ప్లాన్ చేశారు. ఈ క్లాసిక్ ఎంటర్‌టైనర్‌కు అపారమైన క్రేజ్ ఉంది. రీ రిలీజ్ హక్కుల ధర 3.2 కోట్లకు అమ్ముడయ్యాయి. రీ-రిలీజ్ నుండి వచ్చిన లాభాల నుండి కొంత శాతాన్ని మహేష్ బాబు ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

అంతకు ముందు ఖలేజా సినిమాకు కూడా ప్రీమియర్లు వేశారు. అతడు రీరిలీజ్ బుకింగ్‌లు ఇప్పటికే విదేశాలలో ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ముందస్తు బుకింగ్‌లు త్వరలోనే ప్రారంభమవుతాయి.

Next Story