రికార్డుల మోత మోగిస్తున్న 'కళావతి' సాంగ్‌

Mahesh Babu-Keerthy Suresh’s romantic number ‘Kalavathi’ tumbling records. మహేశ్ బాబు, కీర్తి సురేష్‌ల ‘సర్కారు వారి పాట’ సినిమాలోని మొద‌టి సింగిల్‌

By Medi Samrat
Published on : 14 Feb 2022 1:16 PM IST

రికార్డుల మోత మోగిస్తున్న కళావతి సాంగ్‌

మహేశ్ బాబు, కీర్తి సురేష్‌ల 'సర్కారు వారి పాట' సినిమాలోని మొద‌టి సింగిల్‌ 'కళావతి' నిన్న రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో భారీ రికార్డుల మోత మోగిస్తుంది. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన 'కళావతి' పాటను మేకర్స్ ఆదివారం విడుదల చేశారు. 'కళావతి' ప్రేమికుల రోజున విడుదల కావాల్సి ఉంది.. కానీ విడుదలకు ముందే పాట ఆన్‌లైన్‌లో లీకేజీ కావడంతో మేకర్స్ ఒక రోజు ముందుగానే లిరికల్ సాంగ్‌ను ఆవిష్కరించారు. ఏదిఏమైనా 'కళావతి' సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.

మహేష్ బాబు, కీర్తి సురేష్‌ల ఈ రొమాంటిక్ సాంగ్‌ యూట్యూబ్‌లో నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లో ఉన్నందున రికార్డు స్థాయిలో 12+ మిలియన్ల వీక్షణలను అధిగమించింది. ఈ మేర‌కు మేక‌ర్స్ ట్వీట్ చేశారు "కళావతి సాంగ్‌ రికార్డ్‌.. శాస్త్రీయ ప‌ద్ద‌తిలో రికార్డులు దూసుకుపోతున్నాయి. #KalaavathiMusicVideo YouTubeలో 12M+ వీక్షణలతో ట్రెండింగ్ #1" అని మేకర్స్ ట్వీట్ చేశారు. 'సర్కారు వారి పాట' సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించారు. దీనికి ఎస్. థమన్ సంగీతం అందించారు. పూర్తి వినోదంతో కూడిన కమర్షియల్ డ్రామా అని మేకర్స్ వెల్ల‌డించారు. మే 12న విడుదల కానున్న 'సర్కారు వారి పాట' షూటింగ్ చివరి దశలో ఉంది.


Next Story