ఆయన రాసిన డైలాగ్ నేను పలుకుతుంటే ఆ కిక్కే వేరు : మహేష్

Mahesh Babu About Trivikram Movie. మహేష్ బాబు హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ఇంకొన్ని గంటల్లో

By Medi Samrat  Published on  11 May 2022 3:43 PM IST
ఆయన రాసిన డైలాగ్ నేను పలుకుతుంటే ఆ కిక్కే వేరు : మహేష్

మహేష్ బాబు హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ఇంకొన్ని గంటల్లో అభిమానుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మహేష్ బాబు బిజీ బిజీగా గడుపుతూ ఉన్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి నెటిజన్స్ తో కూడా ముచ్చటించారు మహేష్. ముఖ్యంగా త్రివిక్రమ్ తో సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది. మా కాంబినేషన్ అంటేనే డిఫరెంట్ లెవల్ వుంటుంది. ఆయన అద్భుతమైన రచయిత. ఆయన రాసిన డైలాగ్ నేను పలుకుతుంటే ఆ కిక్కే వేరు. ఆయన సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచుస్తున్నా." అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.

సర్కారు వారి పాట సినిమా ఆరు నెలల్లో సినిమా అయిపోయినప్పటికీ.. ఈ సినిమా జర్నీ రెండేళ్ళు సాగింది. ఎక్కడ ఆపమో అక్కడి నుంచి అదే ఎనర్జీతో మొదలుపెట్టడం అంత తేలిక కాదని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో దర్శకుడు పరశురాం, టీమ్ ని మెచ్చుకోవాలని.. ఎనర్జీని హోల్డ్ చేసి పట్టుకున్నారని కితాబిచ్చారు మహేష్. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.. కళావతి పాట నా కెరీర్ లోనే బెస్ట్ సాంగ్ గా నిలిచింది. ట్యూన్ ఇచ్చినపుడు ఈ పాట ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదన్నారు. ఐతే తమన్ బలంగా నమ్మాడు. ప్రతి పెళ్లిలో ఇదే పాట వినిపిస్తుందని చెప్పాడు. అదే జరిగిందని, ఇక రీరికార్డింగ్ కూడా అదరగొట్టాడని మహేష్ చెప్పుకొచ్చారు.










Next Story