స్టైలిష్ లుక్‌లో మహేశ్.. ఆగస్టు 9న సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్

Mahesh Babbu New Movie Update. సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం న‌టిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్‌

By Medi Samrat  Published on  31 July 2021 1:00 PM GMT
స్టైలిష్ లుక్‌లో మహేశ్.. ఆగస్టు 9న సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం న‌టిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్‌ ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కుడు. తాజాగా ఈ చిత్ర యూనిట్ మహేశ్ బాబు కొత్త లుక్ ను సోషల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంది. 2022 జనవరి 13న సంక్రాంతి కానుక‌గా సర్కారు వారి పాట ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు తెలిపారు. అలాగే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు ల్యాండెడ్ ఇన్ స్టైల్‌.. సర్కారు వారి పాట నుంచి ఫస్ట్ నోటీస్ వచ్చేసింది.. అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పోస్టు చేసింది.

అలాగే.. ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ ఉంటుందని అభిమానులకు తీపి కబురు చెప్పింది. ఇక‌ మహేశ్ బాబు స్పందిస్తూ.. సరికొత్త యాక్షన్, ఎంటర్టయిన్ మెంట్ తో వచ్చేస్తున్నాం.. సంక్రాంతికి కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తుండ‌గా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.


Next Story
Share it