కొన్ని రోజుల క్రితం, నటుడు శ్రీకాంత్‌ను డ్రగ్/కొకైన్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కొకైన్ కేసులో నటులు శ్రీకాంత్, కృష్ణలకు మద్రాస్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను ఇచ్చింది. జూన్ 23న, నటుడు శ్రీకాంత్ ను పోలీసులు అరెస్టు చేయగా, కృష్ణను జూన్ 26న చెన్నై నగర పోలీసులు కొకైన్ స్మగ్లింగ్ ఆపరేషన్‌లో పాల్గొన్నందుకు అదుపులోకి తీసుకున్నారు.
శ్రీకాంత్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది జాన్ సత్యన్, శ్రీకాంత్ డ్రగ్స్ వాడాడని ఆరోపించిన ప్రధాన నిందితుడు ప్రదీప్ కుమార్ ఒప్పుకోలు ఆధారంగానే తన క్లయింట్‌ను అరెస్టు చేశారని వాదించారు. అయితే శ్రీకాంత్ వద్ద ఎటువంటి డ్రగ్స్ దొరకలేదని కోర్టులో వాదించారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసినప్పుడు శ్రీకాంత్ ఇంట్లో తన బిడ్డతో ఆడుకుంటున్నాడని జాన్ సత్యన్ అన్నారు.