జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ సీసీ కెమెరా సర్వర్ రూమ్ కి లాక్ వేయడంపై స్పందించిన పోలీసులు

Maa elections cc tv footage contraversy. మా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. రిగ్గింగ్ చేశారని మంచు విష్ణు ప్యానల్ పై ఆరోపణలు చేశారు ప్రకాశ్‌ రాజ్. ఎన్నిక‌ల తీరుపై

By అంజి  Published on  17 Oct 2021 1:30 PM GMT
జూబ్లీహిల్స్ పబ్లిక్  స్కూల్ సీసీ కెమెరా సర్వర్ రూమ్ కి లాక్ వేయడంపై స్పందించిన పోలీసులు

మా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. రిగ్గింగ్ చేశారని మంచు విష్ణు ప్యానల్ పై ఆరోపణలు చేశారు ప్రకాశ్‌ రాజ్. ఎన్నిక‌ల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజీనామాలు కూడా చేశారు. ఓట్ల కౌంటింగ్‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని, ఎలక్షన్ రోజున మోహన్ బాబు, నరేష్ ఇతరులు తమపై దాడి, దౌర్జన్యం చేశారంటూ ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపించారు. ఎలక్షన్ టైం సీసీ ఫుటేజ్ కావాలంటూ ఎన్నిక‌ల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాశారు. కానీ ఎన్నిక‌ల అధికారి కృష్ణమోహన్ అలా సీసీ ఫుటేజ్ ఇవ్వలేమని వెల్లడించారు.

సీసీ ఫుటేజ్ ను మాయం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని.. ప్ర‌కాశ్ రాజ్ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు తాజాగా సీసీ ఫుటేజ్ సర్వర్ రూమ్ కు తాళం వేశారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి స్పందించారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ సీసీ కెమెరా సర్వర్ రూమ్ కి మేము లాక్ వేయలేదని ఆయన తెలిపారు. అంతేకాకుండా పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. శనివారం, ఆదివారం స్కూల్ కి సెలవు కావడం తో వాళ్లే లాక్ వేసుకొని వెళ్లారని వివరణ ఇచ్చారు.

Next Story