సినీగేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూత
Lyricist Vennelakanti passes away. ప్రముఖ సినీగేయ రచయిత వెన్నెలకంటి.. చెన్నైలో గుండెపోటుతో మరణించారు.
By Medi Samrat Published on 5 Jan 2021 6:18 PM ISTప్రముఖ సినీగేయ రచయిత వెన్నెలకంటి.. చెన్నైలో గుండెపోటుతో మరణించారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. 1979 లో చంద్రగిరి SBI లో పనిచేస్తున్న వెన్నెలకంటి, సినీ నటుడు ప్రభాకర్ రెడ్డి ప్రోత్సాహంతో సినీరంగంలో అడుగుపెట్టాడు. దాదాపుగా రెండు వేలకు పైగా పాటలను రాశారు.
నవంబర్ 30 న జన్మించిన వెన్నెలకంటి.. పూర్తీ పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. ఈయన ఇంటి పేరు వెన్నెలకంటి గానే పేరు సంపాదించుకున్నాడు. హరికథలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడమంటే మక్కువ చూపేవాడు. కాలేజీ రోజుల్లో "రసవినోదిని" రేడియో ప్రసంగాలు వినేవారు. 11 ఏళ్లకే కవితలు, పద్యాలూ రాశారు. 1975లో విజయవాడ రేడియో కేంద్రం కవితల పోటీలలో 9 కవితలు సెలెక్టు అయ్యాయి. జంద్యాల రాసిన ఏక్ దిన్కా సుల్తాన్, ఈ చరిత్ర ఏ సిరాతో, ఎవ్వనిచే జనించు, దర్పణం వంటి నాటకాలలో నటించారు. డా. ప్రభాకర్ రెడ్డి ప్రోద్బలముతో శ్రీరామచంద్రుడు సినిమాలో చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల అనే పాట రాశారు పాట వ్రాసారు. గీత రచయితగా తొలి పరిచయం అదే..!
అటు తరువాత అన్నా చెల్లెలులో పాటలు వ్రాసారు. నాయకుడు సినిమాతో అనువాదంలో ప్రవేశించాక.. వెనుతిరిగి చూసుకోలేదు వెన్నెలకంటి.. ప్రేమాగ్ని సినిమాకు తెలుగులో మాటలు వ్రాసారు. కమల్ హాసన్ కు సత్యభామ సినిమాకు డబ్బింగు రాశారు. సుమారు 2000 పాటలు వ్రాసారు. ఇతని కుమారులు శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్ సినిమాలకు సంభాషణల రచయితగాను, రాకేందు మౌళి సినిమా గీత రచయితగాను ఇండస్ట్రీలో ఎదుగుతూ ఉన్నారు. వెన్నెలకంటి మృతిపై పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తూ ఉన్నారు.