ఆ ఫీల్ మిస్ కాకుండా ఉండాలంటే.. చాలా కష్టం!
Lyricist Krishna Kanth. సినిమా ఫీల్ మిస్ కాకుండా పాటలు రాయాలంటే ఎంతో కష్టంతో కూడుకున్నదని తెలిపారు.
By Medi Samrat Published on 11 Jan 2021 10:28 AM ISTసినిమా రంగం అంటేనే ఎన్నో సవాళ్లతో కూడుకున్న పని. అందులో గీత రచయిత్ర పాత్రలు కొంతవరకు కష్టమనే చెప్పవచ్చు. కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి వాటన్నింటిలో అవకాశాలు దక్కించుకోవాలంటే తమలో ఉన్న ప్రతిభను ఎప్పటికప్పుడు బయట పెడితేనే మంచి అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. అలాంటి కోవకు చెందిన వారే కృష్ణకాంత్. "జెర్సీ","పడి పడి లేచే మనసు","టాక్సీ వాలా" వంటి చిత్రాలలో ఎంతో అద్భుతమైన పాటలు రాసి ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న కృష్ణ కాంత్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలు గురించి తన మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం...
2012 సంవత్సరంలో అందాల రాక్షసి సినిమా లో గీత రచయితగా పరిచయమైన కృష్ణ కాంత్ తన సినీ జీవితంలో వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడని చెప్పవచ్చు.కృష్ణకాంత్ రాసిన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో వరుస సినిమాలలో అవకాశాలు సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో మంచి స్నేహితులు, యువ దర్శకుల ప్రోత్సాహం వల్లే తన కెరీర్ సాఫీగా సాగుతుందని తెలిపారు.
కృష్ణకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు ఎనిమిది సంవత్సరాల కాలంలో దాదాపు 75 పాటలను రాశారు. గీత రచయితగా ఎలాంటి పాటలు నైనా మనసుపెట్టి రాస్తుంటారు. కానీ కొంత మంది కొత్తగా వచ్చే దర్శకులు కథపై అవగాహన లేకపోవడం వల్ల అలాంటి సినిమాలు పాటలు రాయాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని. అలాంటి దర్శకులు కథలు సరిగా వివరించకుండా రెండు రోజుల్లో పాటలు కావాలని చెబుతుంటారు. కానీ సినిమా ఫీల్ మిస్ కాకుండా పాటలు రాయాలంటే ఎంతో కష్టంతో కూడుకున్నదని తెలిపారు.
ప్రస్తుతం 'రాధేశ్యాం', 'పాగల్', 'గమనం', 'హిట్2', 'శ్యామ్ సింగరాయ్' ఇలా దాదాపు 25 చిత్రాలకి పాటలు రాస్తున్నట్టు కృష్ణకాంత్ తెలియజేశారు. ప్రభాస్ 'రాధేశ్యాం' చిత్రం కోసం ఇప్పటికే నాలుగు పాటలు రాశా. వీటితో పాటు కీర్తి సురేష్ నటిస్తున్న ద్విభాషా చిత్రం 'సానికాయుదం'కి తెలుగులో సంభాషణలు, పాటలు రాస్తున్నా''. అంటూ కృష్ణకాంత్ తెలియజేశాడు.