ఓటీటీలో వచ్చేస్తున్న లవ్ స్టోరీ.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

Love Story Movie Release On OTT. లవ్ స్టోరీ.. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న

By Medi Samrat  Published on  11 Oct 2021 1:23 PM GMT
ఓటీటీలో వచ్చేస్తున్న లవ్ స్టోరీ.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

లవ్ స్టోరీ.. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే..! అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లవ్ స్టోరీ' మంచి వసూళ్లను రాబడుతోంది. ముప్పై రెండు కోట్ల షేర్ సాధించి ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. 'సారంగ దరియా' సాంగ్.. పాటల్లో సాయి పల్లవి డ్యాన్స్ కు ఎంతో మంది ఫిదా అయిపోయారు. లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ చిల్లం ఈ సినిమాకు సంగీతం అందించారు. రావు రమేష్, దేవయాని, ఉత్తేజ్, ఈశ్వరీరావు, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్ని పోషించారు.

ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు.ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఆహా ఓటీటీ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమా ఆహాలో అక్టోబర్ 22న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానల్ 'స్టార్ మా' సొంతం చేసుకుంది. ఇప్పటికే సినిమా హాల్స్ లో సందడి చేస్తున్న లవ్ స్టోరీ.. ఓటీటీలోనూ, బుల్లితెరపైనా అంతే ఇంపాక్ట్ ను కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


Next Story