'లవ్ స్టోరీ'.. ఇంత ఫాలోయింగ్ ఉందా..!

Love Story Movie Release On 24th. సెకండ్ వేవ్ తరువాత సినిమా థియేటర్లు ఓపెన్ చేసినా థియేటర్ల దగ్గర సందడి మాత్రం

By Medi Samrat  Published on  18 Sep 2021 2:00 PM GMT
లవ్ స్టోరీ.. ఇంత ఫాలోయింగ్ ఉందా..!

సెకండ్ వేవ్ తరువాత సినిమా థియేటర్లు ఓపెన్ చేసినా థియేటర్ల దగ్గర సందడి మాత్రం కనిపించలేదు. 'సీటీమార్' కు హిట్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో కాస్త వెనుకబడే ఉంది. ఈ వీకెండ్ కలెక్షన్స్ ను బట్టి సీటీమార్ హిట్టా.. యావరేజా అన్నది తెలుస్తోంది. ఇక ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమా 'లవ్ స్టోరీ'. ఈ నెల 24వ తేదీన 'లవ్ స్టోరీ' విడుదల కాబోతోంది. ప్రముఖ పట్టణాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఈ సినిమా ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. ఎక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసినా, క్షణాల్లో టికెట్లు అమ్ముడవుతున్నాయని చెబుతున్నారు. హైదరాబాద్ లోని చాలా మల్టిప్లెక్స్ లలో మొదటి రోజు షోలకు సంబంధించిన బుకింగ్స్ చాలావరకూ జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టడం పక్కా అని అంటున్నారు.

ఈ సినిమా ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. రేవంత్, మౌనిక పాత్రల్లో చైతూ, సాయి పల్లవి నటిస్తూ ఉన్నారు. అన్నిరకాల భావోద్యేగాలు, హావభావాలతో ట్రైలర్ డిఫరెంట్ గా సాగింది. లైఫ్‌‌లో సెటిల్ కావడం కోసం ఇటు మిడిల్ క్లాస్ కుర్రాడు (రేవంత్) నాగ చైతన్య, అటు (మౌనిక) సాయిపల్లవి పడే కష్టాలు చాలా సహజంగా చూపించారు. ఈ సినిమాలో చైతన్య , సాయిపల్లవి ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను అక్టోబర్ 10న వినాయక చవితి సందర్భంగా విడుదల చేయాలని భావించారు.

అయితే అదే రోజు నాని నటించిన టక్ జగదీష్ సినిమా ఓటీటీ వేదికగా విడుదల అయ్యింది. ఈ విషయంపై నిర్మాతలకు- థియేటర్స్ యజమానులకు మధ్య చర్చ కూడా జరిగింది. దాంతో లవ్ స్టోరీ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు లవ్ స్టోరీ ఈ నెల 24న విడుదలకానుంది. రావు రమేశ్, ఉత్తేజ్, దేవయాని, ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు. ప‌వ‌న్ సీహెచ్ సంగీతం అందించారు. ఈ సినిమాను సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి.


Next Story
Share it