మిర్యాలగూడ పరువు హత్యకు.. ఈ సినిమాకు సంబంధమే లేదు..!

Love Story Movie Producer Gives Clarity ABout Rumours. ఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో నాగచైతన్య, సాయిపల్లవిలు జంటగా నటించిన చిత్రం

By అంజి  Published on  18 Sep 2021 4:00 AM GMT
మిర్యాలగూడ పరువు హత్యకు.. ఈ సినిమాకు సంబంధమే లేదు..!

శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో నాగచైతన్య, సాయిపల్లవిలు జంటగా నటించిన చిత్రం 'లవ్‌ స్టోరీ'. ఈ సినిమా సెప్టెంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సుమారు 600 థియేటర్లలో రిలీజ్‌ కానుంది. లవ్‌స్టోరీ సినిమా రిలీజ్‌పై చాలా అంచనాలు పెట్టుకున్నామని చిత్ర నిర్మాతల్లో ఒకరైన రామ్‌మోహన్‌ రావు తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ సినిమా టికెట్‌ బుకింగ్‌లో ఫస్ట్‌ డే షోలు మొత్తం నిండిపోయాయన్నారు. అయితే ఏపీలో సినిమా ప్రదర్శనను నిర్ణయించిన సమయానికంటే ముందే మొదలు పెట్టి నాలుగు షోలు నడిపించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

అలాగే మిర్యాలగూడ పరువు హత్యను బేస్‌ చేసుకుని లవ్‌స్టోరీ సినిమా తీశారంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తలపై నిర్మాత్ రామ్‌మోహన్‌ రావు స్పందించారు. అసలు ఆ ఘటనకు లవ్‌స్టోరీ సినిమాకు ఎలాంటి సబంధం లేదని తెలిపారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను అసత్యమని అన్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు తక్కువగా ఉన్నాయన్నని.. ఆ ధరలు కొంత పెరిగితే బాగుంటుందని నిర్మాత్ రామ్‌మోహన్‌ అభిప్రాయపడ్డారు.


Next Story
Share it