అక్కడ రికార్డు కలెక్షన్లు సాధిస్తున్న 'లవ్ స్టోరీ'

Love Story Movie Collections. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో

By Medi Samrat  Published on  27 Sept 2021 6:37 PM IST
అక్కడ రికార్డు కలెక్షన్లు సాధిస్తున్న లవ్ స్టోరీ

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా 'లవ్ స్టోరీ'. ఈ సినిమా అటు తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇటు ఓవర్సీస్ లోనూ దూసుకుపోతోంది. కరోనా కారణంగా ఇటీవలి కాలంలో ఓవర్సీస్ లో పెద్దగా సినిమాలను ఆదరించలేదు. బాలీవుడ్ సినిమాలకు కూడా పెద్దగా కలెక్షన్లు లేవు. తెలుగు సినిమా 'రాజరాజ చోర' కాస్త పర్వాలేదనే విధంగా కలెక్షన్లు సాధించగా.. ఇప్పుడు లవ్ స్టోరీ దూకుడును చూపిస్తోంది.

ఇక అమెరికాలో ల‌వ్‌స్టోరీ విడుద‌లైన కేవ‌లం 3 రోజుల్లోనే 1 మిలియ‌న్ డాల‌ర్ల (రూ.7 కోట్ల 37 ల‌క్ష‌లు) క్ల‌బ్ లోకి చేరిపోయింది. శేఖ‌ర్‌క‌మ్ముల క్లాస్ సినిమా తీస్తాడని ఓవర్సీస్ జనాల నమ్మకం.. ఇక చైతూ, సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌తో ల‌వ్ స్టోరీ స‌క్సెస్‌పుల్ గా వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. ఆదివారం రాత్రి వ‌ర‌కు 2021లో అత్య‌ధిక గ్రాస్ సాధించిన తెలుగు సినిమాగా ల‌వ్‌స్టోరీ నిలిచింది. ల‌వ్‌స్టోరీ 2 మిలియ‌న్ల డాల‌ర్ల మైల్‌స్టోన్ దిశ‌గా వెళుతోంది. ఇకపై వచ్చే పలు సినిమాలు కూడా ఓవర్సీస్ మార్కెట్ పై కన్నేయనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా లవ్ స్టోరీ మంచి కలెక్షన్స్ అందుకుంటూ ఉంది.


Next Story