బాయ్ కాట్ అంటూ.. 'లైగర్' పై పడ్డారు

Liger star Vijay Deverakonda opens up on BoycottLSC trend. బాలీవుడ్ సినిమాలపై ఇటీవలి కాలంలో బాయ్ కాట్ పిలుపులు చాలా ఎక్కువయ్యాయి.

By Medi Samrat  Published on  20 Aug 2022 6:42 PM IST
బాయ్ కాట్ అంటూ.. లైగర్ పై పడ్డారు

బాలీవుడ్ సినిమాలపై ఇటీవలి కాలంలో బాయ్ కాట్ పిలుపులు చాలా ఎక్కువయ్యాయి. పెద్ద పెద్ద సినిమాలపై ఈ బాయ్ కాట్ల ప్రభావం చూపుతోంది. ఇటీవల వచ్చిన ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమా డిజాస్టర్ గా మారడానికి ఈ పిలుపులు కూడా ఓ కారణమని అంటున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాపై ఈ బాయ్ కాట్ ముద్ర పడింది. సోషల్ మీడియాలో లైగర్ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ పోస్టులు పెడుతూ వస్తున్నారు.

విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'లైగర్'. ఆగ‌స్ట్ 25న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. తాజాగా 'లైగర్' సినిమా ప్ర‌మోష‌న్స్‌ లో ఓ ఇంట‌ర్వ్యూలో విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడారు. 'లాల్ సింగ్ చద్దా' అనేది ఆమిర్ ఖాన్ సినిమా మాత్రమే కాదు. దానిపై దాదాపు రెండు నుంచి మూడు వేల కుటుంబాలు ఆధార‌ప‌డ్డాయి' అన్నాడు. ఆమిర్ ఖాన్‌కి విజ‌య్ దేవ‌ర‌కొండ స‌పోర్ట్ చేయ‌టంతో ఇప్పుడు లైగ‌ర్‌పై కూడా నెగిటిల్ ట్రోలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ ట్రోలింగ్ ను తట్టుకుని లైగర్ నిలబడతాడో లేదో చూడాలి. హిందీ సినిమాలను, కరణ్​జోహార్ ​సినిమాలను బాయ్​కాట్ ​చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. లైగర్ సినిమాకు కరణ్ జోహార్ ఒక నిర్మాత కావడం కూడా సినిమాను బాయ్ కాట్ చేయాలని పిలుపు ఇస్తుండడానికి ఒక కారణమని అంటున్నారు.



Next Story