ఓటీటీలో లైగర్ సందడి అప్పటి నుండే అంటున్నారే..?

Liger Movie OTT Update. విజయ్ దేవరకొండ-అనన్య పాండేల తాజా చిత్రం 'లైగర్' థియేటర్లలోకి రాకముందు చాలా సందడి చేసింది.

By Medi Samrat  Published on  7 Sept 2022 6:49 PM IST
ఓటీటీలో లైగర్ సందడి అప్పటి నుండే అంటున్నారే..?

విజయ్ దేవరకొండ-అనన్య పాండేల తాజా చిత్రం 'లైగర్' థియేటర్లలోకి రాకముందు చాలా సందడి చేసింది. బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని భావించారు. కానీ సినిమా ఒక్క వారం కూడా థియేటర్లలో నిలవలేకపోయింది. ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ ను సాధించినప్పటికీ.. లాంగ్ రన్ లో మాత్రం భారీగా షాకిచ్చింది. విడుదల రోజున మిశ్రమ సమీక్షల నేపథ్యంలో, 'లైగర్' అన్ని భాషల్లో విడుదలైన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.33.12 కోట్లు రాబట్టగలిగింది. కానీ ఆ తర్వాత భారీ నష్టాలను డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ ఓనర్లకు మిగిల్చింది.

ఇక త్వరలోనే లైగర్ ఓటీటీలోకి రాబోతోందని అంటున్నారు. 'లైగ‌ర్' సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. భారీ ధరకు లైగర్ సినిమాను సొంతం చేసుకుంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. ఇప్పుడు ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 30 నుండి స్రీమింగ్ కానున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే ఛాన్స్ ఉంది.

పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే లు లీడ్ పెయిర్ గా నటించారు. విజయ్ దేవరకొండకు మొదటి పాన్-ఇండియా సినిమా ఇది. లైగర్‌లో రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్, మరియు మకరంద్ దేశ్‌పాండే కూడా ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ప్రపంచం లోనే దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కూడా సినిమాలో నటించడంతో భారీ అంచనాలు సినిమాపై కలిగాయి. కానీ మొదటి రోజే ఎవరూ ఊహించని నెగటివిటీని సినిమా సొంతం చేసుకుంది.


Next Story