కోర్టుకెక్కిన ప్రభాస్ సినిమా.. కారణం ఏంటంటే?

lawyer files petition against adipurush actor saif ali khan and director. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం పై తీవ్ర

By Medi Samrat  Published on  17 Dec 2020 5:12 PM IST
కోర్టుకెక్కిన ప్రభాస్ సినిమా.. కారణం ఏంటంటే?

ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.ఈచిత్రం పై ఉత్తప్రదేశ్‌కు చెందిన ఓ లాయర్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ సినిమాలో ప్రభాస్ కథానాయకుడిగా రాముడి పాత్రలో కనిపించనున్నారు.

రావణుడి పాత్రలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్ నటించనున్నారు. రామాయణంలో భాగంగా రాముడు, రావణుడితో ఎందుకు యుద్ధం చేశాడనే కోణంలో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్నారు.

ఈ చిత్రం పై ఉత్తరప్రదేశ్ కు చెందిన లాయర్ హిమాన్షు శ్రీవాస్తవ బుధవారం జౌన్‌పూర్‌ కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ చిత్రంలో రావణాసురుడి పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ ఈ సినిమాలో రావణుడి పాత్ర చేయడం ఎంతో ఆసక్తికరంగా ఉందని తెలిపాడు.అంతేకాకుండా రాముడికి రావణాసురుడికి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది అనే విషయంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రావణాసురుడి మానవత్వ కోణాన్ని కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నారని తెలియజేశాడు. అయితే హిందువులు రాక్షసుడుగా భావించే రావణాసురుడిని పొగుడుతూ సైఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

సైఫ్ రావణుడిని పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు హిందూ మతాల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, పలు హిందూ సంఘాలు సైఫ్ అలీ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలను ఖండిస్తూ లాయర్ హిమాన్షు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ లో సైఫ్ ఆలీఖాన్ తో పాటు, దర్శకుడు ఓం రౌత్ పేర్లను పేర్కొన్నాడు. ఈ విషయంపై స్పందించిన సైఫ్ అలీ ఖాన్ తన మాటలను వెనక్కి తీసుకుంటూ అందుకు క్షమాపణలు కూడా తెలియజేశారు. సైఫ్ క్షమాపణ చెప్పినప్పటికీ పలువురు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ తరచూ ఈ వివాదాన్ని రేకెత్తిస్తున్నారు.


Next Story