మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి ఓటీటీలోకి వచ్చేస్తోంది
అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి'
By Medi Samrat Published on 30 Sept 2023 4:05 PM ISTఅనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి' సెప్టెంబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సున్నితమైన ఇతివృత్తంతో రూపొందిన ఈ ప్రేమకథకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా సినిమాలో నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో కట్టేశాడు. ప్రమోషన్స్ కూడా మొత్తం తన భుజాన వేసుకున్నాడు. ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేశాడు.
ఇక ఈ బ్లాక్ బస్టర్ చిత్రం OTT స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. పాపులర్ OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన యువీ క్రియేషన్స్ ఈ సినిమా OTT హక్కులను మంచి ధరకు నెట్‌ఫ్లిక్స్‌కి అమ్మింది. 4 వారాల థియేట్రికల్ రన్ పూర్తి అవ్వగానే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' అక్టోబర్ 5 నుండి నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. ఈ చిత్రానికి యువ దర్శకుడు పి మహేష్ బాబు దర్శకత్వం వహించారు. సినిమాను క్లీన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన తీరు అభినందనీయం. వినోదం, భావోద్వేగాల మిశ్రమంతో తీసిన కథలో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి నటన ఆకట్టుకుంది. మురళీ శర్మ, అభివన్ గోమతం, నాజర్, జయసుధ, తులసి, సోనియా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.