లతా మంగేష్కర్ వందల కోట్ల ఆస్తులు ఎవరికి..?

Lata Mangeshkar Left Behind Her Property Worth So Many Crores. లతా మంగేష్కర్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు దాదాపు 200 కోట్లకు పైనే ఉంటాయని

By Medi Samrat  Published on  7 Feb 2022 10:35 AM GMT
లతా మంగేష్కర్ వందల కోట్ల ఆస్తులు ఎవరికి..?

లతా మంగేష్కర్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు దాదాపు 200 కోట్లకు పైనే ఉంటాయని సమాచారం. ఆమె చివరి వరకు ప్రభు కుంజ్ అనే నివాసంలో ఉన్నారు. ముంబై పెద్దర్ రోడ్లో మరో విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. ఆమెకి పాటల ద్వారానే కాక రెంట్స్ రూపంలో కూడా సంపాదన వస్తుంది. ఆమె పాడిన పాటలకు రాయల్టీ ద్వారా సంవత్సరానికి దాదాపు 5 కోట్ల పైగానే ఆదాయం వస్తోందని ఓ పెద్ద మీడియా సంస్థ తెలిపింది. అయితే ఈ ఆస్తులు ఎవరికి వెళతాయనే ప్రశ్న కూడా పలువురికి ఉంది.

లతాజీ పెళ్లి చేసుకోలేదు. ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 200 కోట్లపైనే. సాధారణంగా మరణాంతరం వారి ఆస్తులు పిల్లలకు లేదా భర్తకు చెందుతాయి. లతాజీ ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయనేది ప్రశ్నగా మారింది. ఆమె చెల్లెల్లు ఆశా భోంస్లే, మీన ఖడికర్, ఉషా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్లకు దక్కుతాయని అంటున్నారు. తన తండ్రి పేరుపై కట్టించిన ట్రస్ట్‌కు కూడా లతా ఆస్తులు వెళ్లే అవకాశం ఉంది. లతాజీ లాయరు ఎలాంటి ప్రకటన ఇవ్వనున్నాడనే సస్పెన్స్ కూడా కొనసాగుతోంది.


Next Story
Share it